Begin typing your search above and press return to search.

రమన్ రాఘవ్‌ 2.0.. అంత లేదే!!

By:  Tupaki Desk   |   10 May 2016 6:42 PM IST
రమన్ రాఘవ్‌ 2.0.. అంత లేదే!!
X
ఆ మధ్యన ''గ్యాంగ్స్‌ ఆఫ్‌ వసేపూర్‌'' సినిమాతో సక్సెస్‌ ను చవిచూసిన దర్శకుడు అనురాగ్‌ కశ్యప్‌.. మొన్ననే బాంబే వెల్వెట్‌ సినిమాతో ఘోర పరాజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పుడు ''రమన్‌ రాఘవ్ 2.0'' అనే సినిమా వస్తోంది. ఈ సినిమా ట్రైలర్‌ ఇవాళే రిలీజైంది.

ఎప్పటిలాగానే ఈసారి కూడా మర్డర్ మిస్టరీనే పికప్‌ చేసుకున్నాడు అనురాగ్‌. ఈసారి 1960లలో పోలీసులకు పిచ్చెత్తించిన రమన్ అనే ఒక సీరియల్‌ కిల్లర్‌ ఉదంతంలో సినిమాను తీస్తున్నాడు. ఆ పాత్రలో నవాజుద్దీన్‌ సిద్దికీ నటిస్తున్నాడు. ఇక అతగాడు ఒక పోలీస్‌ ఇన్సపెక్టర్‌ (విక్కీ కౌషల్‌) పాత్రను వెంబడిస్తూ.. అతడికి ట్రబుల్స్‌ సృష్టిస్తూ ఉంటాడు. ఇకపోతే ఈ ఇన్సపెక్టర్‌ గాళ్‌ ఫ్రెండ్‌గా తెలుగుపిల్ల.. మిస్‌ ఇండియా ఎర్త్‌ శోభిత ధూలిపాళ నటించింది. ఈ ట్రైలర్‌ మొత్తంలో నవాజుద్దీన్‌ యాక్టింగ్‌ తప్పిస్తే.. అసలు కిక్‌ అనేదే పెద్దగా లేదు. ఈ మధ్యన చాలా థ్రిల్లర్‌ సినిమాలు వస్తుండటంతో.. నవాజుద్దీన్‌ లీడ్ లో వచ్చిన ఈ సినిమా.. ఏదో లోపాలతో ఉన్నట్లు అనిపించింది.

మరి ఈసారైనా అనురాగ్‌ కశ్యప్‌ హిట్టు కొడతాడో లేదో చూడాలి. అతని ఫ్యాన్స్‌ మాత్రం ఫుల్లుగా ఎక్సయిటైపోతున్నారు.