Begin typing your search above and press return to search.

రామలక్ష్మి కష్టం మామూలుగా లేదుగా..

By:  Tupaki Desk   |   15 Feb 2018 10:06 AM IST
రామలక్ష్మి కష్టం మామూలుగా లేదుగా..
X
పాత్ర నచ్చితే ఎలాంటి రోల్ చేయడానికైనా సిద్ధమే.. స్టార్ హీరోయిన్ల నోటి నుంచి తరచూ వచ్చే మాటే ఇది. అలాగని గ్లామర్ కంటెంట్ ఏ మాత్రం లేని పాత్ర ఆఫర్ చేస్తే అయిపు లేకుండా పోయేవారే ఎక్కువ. దీనికితోడు సినిమా కోసం అన్ని కంఫర్ట్స్ వదులుకుని ఓ అతి సాధారణమైన పల్లెటూరి అమ్మాయిలా కష్టపడాలంటే మాకొద్దీ రోల్ అని దండం పెట్టేస్తారు.

కానీ అక్కినేని వారి కోడలు సమంత మాత్రం ఈ విషయంలో గ్రేటనే చెప్పాలి. తాజాగా ఆమె హీరోగా నటిస్తున్నరంగస్థలం మూవీలోని రామలక్ష్మి పాత్ర చూస్తే ఈ సినిమా కోసం శామ్ ఏ రేంజిలో చెమట చిందించిందో తెలుస్తుంది. అస్సలు గ్లామర్ కు స్కోప్ లేని పాతకాలం దుస్తుల్లో.. జడకు ఓ రిబ్బన్ పట్టుకుని కాళ్లకు చెప్పులు లేకుండా.. నెత్తిన చెరకు మోపుతో నడుస్తూ కనిపించింది. మరోచోట మురుగు నీళ్లలో నుంచుని గేదెలను కడుగుతూ కనిపించింది. ఎండలో తిరిగితే కందిపోతాం.. నీళ్లు బాగోలేకపోతే కమిలిపోతాం.. అంటూ కొంచెం ఎక్స్ ట్రా డైలాగులు చెప్పే హీరోయిన్లు సమంత కమిట్ మెంట్ చూస్తే కళ్లు తిరిగి పడిపోవడం ఖాయం.

సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న రంగస్థలం మూవీలో హీరో రామ్ చరణ్ తేజ్ చిట్టిబాబు పాత్రలో కనిపించనున్నాడు. ఆ చిట్టిబాబు గుండెను కొల్లగొట్టిన రామలక్ష్మిగా సమంత నటిస్తోంది. ఈ పాత్రలు ఇంకెవరైనా చేయగలిగితే చేయొచ్చేమో కానీ ఇంత కష్టపడతారా అంటే... సమాధానం అవును అని చెప్పడం కాస్త కష్టమే.