Begin typing your search above and press return to search.

ఆ పాట కదిలించి వేయడం ఖాయం

By:  Tupaki Desk   |   31 May 2018 4:19 AM GMT
ఆ పాట కదిలించి వేయడం ఖాయం
X
టాలీవుడ్ లోని సాంగ్ రైటర్లలో రామజోగయ్య శాస్త్రిది ప్రత్యేక స్థానం. సినిమాలోని సిట్యుయేషన్ కు అనుగుణంగా పాటలు రాయడంలో ఆయన దిట్ట. దాంతోపాటు ఎమోషనల్ సాంగ్స్ కూడా అద్భుతంగా రాయగల ప్రతిభ ఆయన సొంతం. తాజాగా విడుదలైన మహానటి సినిమాలోని టైటిల్ సాంగ్ ఎమోషనల్ గా ఎంతమందిని కదిలించిందో చెప్పాల్సిన పనిలేదు.

తాజాగా ఎన్టీఆర్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో వస్తున్న అరవింద సమేత వీరరాఘవ సినిమాకు సైతం పాటలు రాస్తున్నారు. ఇందులోనూ కథకు అనుగుణంగా ఓ ఎమోషనల్ సాంగ్ వస్తుంది. దీనిని రామజోగయ్య శాస్త్రే రాస్తున్నారు. ఈ పాట రాస్తున్న సందర్భంగా ఆయన తన ఫీలింగ్ ను సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. ‘‘రాఘవ నన్ను వెంటాడుతున్నాడు అలాంటి ఎమోషనల్ సాంగ్ తో... రోమాంచనాలు - హృదయ ప్రకంపనాలు -కన్నీటి జీరలు ఖచ్చితం’’ అంటూ ట్వీట్ చేశాడు.

అంత పెద్ద రచయితను.. ఎన్నో ఎమోషనల్ సాంగ్స్ రాసిన రైటర్ ను ఆ పాట అంత కదిలించి వేసిందంటే సామాన్యమైన విషయమేం కాదు. ఈ లెక్కన సినిమాలో ఈ పాట అందరి మనసును కదిలించి వేయడం ఖాయం. ఈ ట్వీట్ తో ఎన్టీఆర్ అభిమానులకు త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాపై మరింత అంచనాలు పెరగడం ఖాయం. అరవింద సమేత సినిమాలో పూజా హెగ్డే.. ఈషా రెబ్బా హీరోయిన్లుగా నటిస్తున్నారు.