Begin typing your search above and press return to search.

ర‌మా రాజ‌మౌళి కి న‌చ్చ‌ని మూవీ!

By:  Tupaki Desk   |   27 Dec 2019 10:10 AM GMT
ర‌మా రాజ‌మౌళి కి న‌చ్చ‌ని మూవీ!
X
ఇలా థియేట‌ర్ల‌ లోకి వ‌చ్చిన సినిమా అలా పైర‌సీ లో అందుబాటు లోకి వ‌స్తోంది. కొత్త సినిమాల్ని క్వాలిటీ హెచ్‌.డి. వీడియోలో చూస్తున్నారు. అలాంటిది 12 ఏళ్ల క్రితం రిలీజైన‌ది.. ఇప్పుడు డ‌బ్బింగ్ అయ్యి రిలీజ‌వుతుండ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగించ‌కుండా ఉంటుందా? కానీ అలాంటి సాహ‌స‌మే చేస్తున్నారు జ‌క్క‌న్న క్రేజును న‌మ్ముకుని.

ఎన్టీఆర్ క‌థానాయ‌కుడిగా ఎస్.ఎస్.రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన `య‌మ‌దొంగ‌` చిత్రాన్ని ఇన్నాళ్టికి త‌మిళం లోకి అనువ‌దించి ఈ జ‌న‌వ‌రి 3న‌ రిలీజ్ చేస్తున్నారు. ఇది సాహ‌స‌మే అయినా అలాంటి ప్ర‌య‌త్నం చేస్తుండ‌డ‌డం ఆశ్చ‌ర్య‌ క‌ర‌మే. ఇప్ప‌టికే సీడీ షాపుల్లో తెలుగు వెర్ష‌న్ `య‌మ‌దొంగ` అందుబాటు లో ఉంది. అయినా త‌మిళ వెర్ష‌న్ కాబ‌ట్టి చూస్తారా? అన్న‌ది స‌స్పెన్స్. పాన్ ఇండియా డైరెక్ట‌ర్ - పాన్ ఇండియా స్టార్ క‌ల‌యిక‌ లో అంటూ అక్క‌డ ప్ర‌చారం ఊద‌ర‌ గొడితే క‌లిసొస్తుందేమో?

నాడు స్లీప‌ర్‌ హిట్ గా నిలిచిన `య‌మ‌దొంగ‌` చిత్రం తార‌క్ అభిమానుల‌ కు న‌చ్చిందేమో కానీ.. ఆ మూవీపై జ‌నాల్లో భిన్నాభిప్రాయాలున్నాయి. సీనియ‌ర్ ఎన్టీఆర్ య‌మ‌దొంగ స్ఫూర్తితో తెర‌కెక్కినా.. కేవ‌లం తార‌క్ వ‌ల్ల‌నే ఆ చిత్రం హిట్ట‌య్యింద‌ని అభిప్రాయం వ్య‌క్త‌మైంది. అంతేకాదు.. ఆ చిత్రం ఎందుక‌నో త‌న‌కు న‌చ్చ‌ లేద‌ని అప్ప‌ట్లో ద‌ర్శ‌క‌ ధీరుని స‌తీమ‌ణి ర‌మ ఓ ఇంట‌ర్వ్యూలో వెల్ల‌డించ‌డం హాట్ టాపిక్ అయ్యింది. రాజ‌మౌళి సినిమా ల్లోనే త‌న‌కు న‌చ్చ‌ని సినిమా ఇద‌ని ర‌మా రాజ‌మౌళి అన్నారు. అయితే త‌న‌కు న‌చ్చ‌నిది త‌మిళ తంబీల‌కు న‌చ్చుతుందా? అన్న‌ది చూడాలి.