Begin typing your search above and press return to search.

రమారాజమౌళి సమేత పూజాకార్తికేయ

By:  Tupaki Desk   |   2 Oct 2018 4:21 AM GMT
రమారాజమౌళి సమేత పూజాకార్తికేయ
X
రమ-రాజమౌళిల తనయుడు కార్తికేయ ఎంగేజ్ మేంట్ రీసెంట్ గా పూజా ప్రసాద్ తో జరిగింది. కార్తికేయ - పూజలు ఇద్దరూ ఆరేళ్ళ ప్రేమ తర్వాత పెళ్లితో ఒకింటివారు కానున్నారు. సీనియర్ టాలీవుడ్ హీరో జగపతిబాబు సోదరుని కుమార్తె పూజ అనే సంగతి తెలిసిందే. ఎంగేజ్ మెంట్ సమయం నుండి కార్తికేయ - పూజలపై ఆటోమేటిక్ గా మీడియా అటెన్షన్ పెరిగింది.

తాజాగా రాజమౌళి - రమ లతో పాటు కార్తికేయ - పూజ లు కలిసి ఉన్న ఒక ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అందరూ ఫుల్లు హ్యాపీగా ఉన్నారన్న విషయం వారి స్మైల్స్ చూస్తేనే మనకు అర్థం అవుతుంది. రమారాజమౌళి సమేత పూజాకార్తికేయ రీసెంట్ గా ఒక బర్త్ డే పార్టీకి హాజరయ్యారని.. ఆ సందర్భంగా చిరునవ్వులు చిందిస్తూ ఫోటోకు పోజు ఇచ్చారని సమాచారం.

రాజమౌళి కాబోయే కోడలు పూజా ప్రసాద్ ఒక కర్ణాటక సంగీత గాయని. ఇప్పటికే పలు భక్తి ఆల్బమ్స్ లో పాటలు పాడిందట. రాజమౌళి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ రాజమౌళి సినిమాలలో ఏదో ఒకరకంగా పాలుపంచుకుంటారు కాబట్టి ఫ్యూచర్ లో పూజా ప్రసాద్ ఒక పాట పాడే అవకాశం ఉందని కూడా అంటున్నారు.