Begin typing your search above and press return to search.

సంక్రాంతి వార్: రామ్ 'రెడ్' vs రవితేజ 'క్రాక్'

By:  Tupaki Desk   |   26 Dec 2020 5:30 PM GMT
సంక్రాంతి వార్: రామ్ రెడ్ vs రవితేజ క్రాక్
X
తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సీజన్ సినిమాలకు బెస్ట్ సీజన్ అనే విషయం తెలిసిందే. కోవిడ్ నేపథ్యంలో వచ్చే సంక్రాంతికి సినిమా పండుగ ఉండదని అనుకుంటున్న సమయంలో థియేటర్స్ రీ ఓపెన్ అవడం నూతనోత్సాహాన్ని ఇచ్చింది. ఇప్పటికే థియేట్రికల్ రిలీజైన 'సోలో బ్రతుకే సో బెటర్' సినిమాకి ప్రేక్షకుల నుంచి వచ్చిన స్పందన ఆశాజనకంగా ఉండటంతో మేకర్స్ అందరూ తమ సినిమాలను ఫెస్టివల్ సీజన్ లో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. ముందుగా మాస్ మహారాజ్ నటించిన 'క్రాక్' చిత్రాన్ని 2021 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే ప్రచార చిత్రాలు సాంగ్స్ తో ఈ సినిమాపై పాజిటివ్ బజ్ క్రియేట్ అయింది. ఠాగూర్ మధు నిర్మాణంలో గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని జనవరి 14న విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి.

ఇదే క్రమంలో ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని నటించిన 'రెడ్' చిత్రాన్ని కూడా సంక్రాంతి సీజన్ లోనే తీసుకొస్తున్నట్లు మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ చిత్రాన్ని 2021 జనవరి 14న విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. కిశోర్ తిరుమల దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని శ్రీ స్రవంతి మూవీస్ బ్యానర్‌ పై 'స్రవంతి' రవి కిషోర్ నిర్మించారు. ఇన్నాళ్లూ థియేట్రికల్ రిలీజ్ కోసం వెయిట్ చేసిన రామ్ ఇటీవలే 'రెడ్' ట్రైలర్ రిలీజ్ చేసి అంచనాలు పెంచేశాడు. రామ్ డ్యూయల్ రోల్ కనిపించిన ఈ సినిమా కంటెంట్ పై నమ్మకంగా ఉన్నాడు. 'దేవదాస్' 'మస్కా' సినిమాల తర్వాత రామ్ సినిమా సంక్రాంతి కి రిలీజ్ చేస్తున్న సినిమా 'రెడ్' కావడం గమనార్హం. ఇప్పుడు 'క్రాక్' మరియు 'రెడ్' సినిమాలు రెండూ జనవరి 14న వస్తుండటంతో ఈసారి బాక్సాఫీస్ వద్ద రవితేజ vs రామ్ గా మారనుంది.

ఇదిలావుండగా దగ్గుబాటి రానా నటించిన 'అరణ్య' చిత్రాన్ని కూడా 2021 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు ఇదివరకే ప్రకటించారు. ప్ర‌భు సాల్మ‌న్ దర్శకత్వంలో రూపొందిన ఈ త్రిభాషా సినిమాని సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నామని చెప్పినప్పటికీ డేట్ ని వెల్లడించలేదు. అలానే కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటించిన 'మాస్టర్' చిత్రాన్ని పాన్ ఇండియా లెవల్లో సంక్రాతి బరిలో నిలపాలని చూస్తున్నారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే జనవరి 13న 'మాస్టర్' రిలీజ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. 'సోలో బ్రతుకే సో బెటర్' కి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన రావడంతో ఇప్పుడు ఈ సినిమాలన్నీ పండుగ సీజన్ లో బాక్సాఫీస్ కలెక్షన్స్ కొల్లగొట్టాలని చూస్తున్నాయి.