Begin typing your search above and press return to search.

#2021 .. ఇస్మార్ట్ డ‌బుల్ ధ‌మాకా ట్రీట్ ఎప్పుడు?

By:  Tupaki Desk   |   26 Dec 2020 2:30 PM GMT
#2021 .. ఇస్మార్ట్ డ‌బుల్ ధ‌మాకా ట్రీట్ ఎప్పుడు?
X
ఒకే ఒక్క బ్లాక్ బ‌స్ట‌ర్ ఆ ఇద్ద‌రిలో జీవం నింపింది. కొన్ని వరుస డిజాస్ట‌ర్ల‌తో కెరీర్ డైల‌మాలో ఉన్న‌ప్పుడు కంబ్యాక్ కి సాయ‌మైంది. ఆ మూవీ ఇస్మార్ట్ శంక‌ర్. ఆ ఇద్ద‌రూ ఎవ‌రో చెప్పాల్సిన పనే లేదు. ఒక‌రు స్టార్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ .. అలాగే యువ‌హీరో రామ్. ఈ ఇద్ద‌రి క‌ల‌యిక‌లో ఇస్మార్ట్ శంక‌ర్ సీక్వెల్ కూడా ప్ర‌క‌టించారు. అయితే ఈ సీక్వెల్ సెట్స్ పైకి వెళ్లేదెపుడు? అంటే ఇప్ప‌టికీ క్లారిటీ రాలేదు.

2019 యాక్షన్ ఎంటర్ టైనర్ ఐస్మార్ట్ శంకర్ తో త‌న‌కు బ్లాక్ బ‌స్ట‌ర్ ఇచ్చిన పూరీకి రామ్ బహిరంగంగా కొన్ని సందర్భాల్లో కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పుడు పూరీకి కృత‌జ్ఞ‌త‌గా వేరొక విధంగా సాయం కూడా చేస్తున్నాడు రామ్. పూరి జగన్నాధ్ కుమారుడు ఆకాష్ పూరి- దిల్లీ బ్యూటీ కేతిక శర్మ న‌టిస్తున్న `రొమాంటిక్` లో రామ్ భాగ‌మ‌య్యాడు. ఈ మూవీ కథను రామ్ తన గొంతు ద్వారా ఆడియెన్ కి వినిపిస్తాడ‌ట‌.రొమాంటిక్ లో ప్రత్యేక అతిధి పాత్రలో రామ్ కనిపించనున్నట్లు వార్తలు వచ్చినా అందులో నిజం లేదు.

రొమాంటిక్ ను పూరి - చార్మి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. పూరి శిష్యుడు అనీల్ పాడూరి ఈ చిత్రానికి దర్శకుడు. ఈ చిత్రంలో రమ్య కృష్ణ ఓ కీలక పాత్రలో నటించారు. ఈ చిత్రం వచ్చే ఏడాది వేసవిలో విడుదలకు సిద్ధమవుతోంది. ఇక‌పోతే అప్ప‌టికి రామ్ తో ఇస్మార్ట్ శంక‌ర్ సీక్వెల్ పైనా పూరీకి క్లారిటీ వ‌చ్చే వీలుంద‌ట‌. మ‌రోవైపు రౌడీ విజ‌య్ దేవ‌రకొండ‌తో పూరి ఫైట‌ర్ మూవీని తెర‌కెక్కిస్తున్న సంగ‌తి తెలిసిన‌దే.