Begin typing your search above and press return to search.

ఇంట్లో మందు బాటిల్ ఉన్నా.. బార్ కే : హీరో రామ్

By:  Tupaki Desk   |   24 Dec 2020 11:42 AM GMT
ఇంట్లో మందు బాటిల్ ఉన్నా.. బార్ కే : హీరో రామ్
X
ప్రతీ ఇంట్లో పూజగది ఉంటుంది.. కానీ, గుడికి వెళ్తేనే మనసుకు హాయి’ అన్నారు హీరో రామ్. ఈ ఎనర్జిటిక్ హీరో నటించిన ‘రెడ్’ మూవీ సంక్రాంతి బరిలో నిలిచింది. ఈ సినిమాకు సంబందించిన ట్రైలర్ ను AMB సినిమాస్ లో లేటెస్ట్ గా లాంచ్ చేశారు. అనంతరం ప్రెస్ మీట్ కూడా నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన రామ్.. ఆడియన్స్ ను అట్రాక్ట్ చేసేందుకు ప్రయత్నించారు. ఇంట్లోంచి థియేటర్ కు రప్పించేందుకు వెరైటీ కొటేషన్స్ చెప్పాడు.

అవాంతరాలు అధిగమించి..
రామ్ మాట్లాడుతూ... ‘చాలా రోజుల తరువాత థియేటర్ లోకి రావడం చాలా కొత్తగా అనిపించింది. సినిమా ట్రైలర్ చూశాక చాలా కొత్తగా అనిపించింది. నేను ఇదివరకే రెండు మూడుసార్లు చూశాను. కానీ బిగ్ స్క్రీన్ పై ఇక్కడ చూడగానే సమ్ థింగ్ స్పెషల్ అనిపించింది.’ అన్నారు. కరోనా నేపథ్యంలో ఎన్నో అవాంతరాలు దాటుకొని సినిమా థియేటర్ వద్దకు వచ్చిందన్నారు.

వాయిదాల మీద వాయిదాలు..
‘ఈ రెడ్ మూవీ ఎప్పుడో విడుదల కావాల్సింది. కానీ రిలీజ్ సమయం కోసం కొన్ని నెలలుగా ఎదురు చూస్తూనే ఉన్నా’మని చెప్పాడు. ఇక ఫైనల్ గా రిలీజ్ అవుతుందని తెలిశాక చాలా ఆనందంగా అనిపించిందన్నాడు హీరో. సినిమా విడుదలైతే ఒక్కసారిగా పడిన కష్టమంతా మరచిపోవచ్చు. దర్శకుడు కిశోరు తిరుమల ఈ సినిమాని చాలా డిఫరెంట్ గా సరికొత్తగా తెరకెక్కించినట్లు రామ్ చెప్పాడు.

దర్శకుడిపై డౌట్ పడ్డా..
‘డైరెక్టర్ కిషోర్ తో మొదట ‘నేను శైలజా’ ఆ తరువాత ‘ఉన్నదీ ఒక్కటే జిందగీ’ సినిమాలు చేశాను. కానీ.. అలాంటి దర్శకుడు నా దగ్గరకు ‘రెడ్’ కథ చెప్పడానికి వచ్చినప్పుడు ఆయన చేయగలరా? అని అనుకున్నాను. ఎందుకంటే.. అంతకుముందు ఆయనతో ఇలాంటి థ్రిల్లర్ మాస్ సినిమా చేయలేదు. కానీ.. కిషోర్ కథ చెబుతున్నప్పుడు ఆయనలో చాలా కాన్ఫిడెన్స్ కనిపించింది.’ అన్నారు రామ్.

పూజగది ఉన్నా.. గుడికే
‘ఇంట్లో పూజ గది ఉన్నా అందరం గుడికే వెళతాము. స్విగ్గి ఉన్నా కూడా రెస్టారెంట్ కే వెళతాం. ఇక ఇంట్లో బాటిల్ ఉన్నా కూడా బార్ కే వెళతాం.. అలాగే.. టీవిలో ఎంత కొత్త సినిమా వచ్చినా కూడా థియేటర్ కు రావాల్సిందే’ అంటూ ఆడియన్స్ ను ఎట్రాక్ట్ చేశారు హీరో రామ్. మరి, రామ్ మాటలను ఇన్సిపిరేషన్ గా తీసుకొని ప్రేక్షకులు ఏ మేరకు థియేటర్లో అడుగు పెడతారో చూడాలి.