Begin typing your search above and press return to search.

దూకుడు పెంచిన టాలీవుడ్ చాక్లెట్ బాయ్..

By:  Tupaki Desk   |   1 May 2020 9:00 AM IST
దూకుడు పెంచిన టాలీవుడ్ చాక్లెట్ బాయ్..
X
టాలీవుడ్ లో ప్లాపులతో సతమతం అవుతోన్న హీరో రామ్ ఇటీవలే ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమా ద్వారా హిట్ కొట్టిన సంగతి తెల్సిందే. ఈ సినిమా విజయంతో హీరో రామ్ రెట్టింపు దూకుడుతో సినిమాలు చేస్తున్నాడు. అయితే థియేటర్లలోనే కాదు డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్ లో కూడా రామ్ హవా నడుస్తోంది. హిందీలో డబ్ అయిన రామ్ సినిమాల్లో 4 సినిమాలు యూట్యూబ్ లో 100 మిలియన్ వ్యూస్ సాధించి రికార్డు నెలకొల్పాయి. ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాను ఫిబ్రవరిలో యూట్యూబ్ లో విడుదల చేసారు. అయితే ఆ సినిమా వ్యూస్ ఇప్పుడు 100 మిలియన్ దాటిపోతున్నాయి. ఇప్పుడు ఇస్మార్ట్ సినిమాతో రామ్ నాలుగోసారి ఆ మార్క్ చేరుకొని రికార్డు సాధించాడు. ప్రస్తుతం కరోనా కారణంగా లాక్ డౌన్ లో ఉన్న రామ్ తన ఇటీవలే రెడ్ సినిమాను కంప్లీట్ చేసాడు.

లాక్ డౌన్ వలన థియేటర్లు మూతపడటంతో సినిమా విడుదలకు నోచుకోకుండా వాయిదా పడింది. ఇక చేసేదేం లేక హీరోలు ఇళ్లకు పరిమితమై కాలాన్ని వెళ్లదీస్తున్నారు. అయితే కరోనా లాక్ డౌన్ టైం కూడా వృధా చేయడం ఎందుకని కొందరు వాళ్ల సినిమా పనులలో నిమగ్నం అవుతున్నారు. తాజాగా చాక్లెట్ బాయ్ రామ్ కరోనా అనంతరం వరుస సినిమాలతో దూసుకుపోవాలని ప్లాన్ చేస్తున్నాడట. అందులో భాగంగానే ప్రస్తుతం ఆన్ లైన్లో కథలు వింటున్నాడట. ఇక కథలు వినిపిస్తున్న వారిలో ఇస్మార్ట్ పూరీ జగన్నాథ్ కూడా ఉన్నట్లు సమాచారం. వీరిద్దరూ ఇది వరకే మరోసారి కలిసి సినిమా చేద్దాం అని ట్విట్టర్ ద్వారా మాట్లాడుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ విషయం ఎంతవరకు నిజం అనేది ఇంకా తెలియలేదు. కాబట్టి అధికారిక ప్రకటన వెలువడే వరకు అభిమానులు వేచియుండాల్సి ఉంది.