Begin typing your search above and press return to search.

బిలో యావరేజ్‌ హీరో అయిపోతున్నాడు

By:  Tupaki Desk   |   8 Dec 2015 11:30 AM GMT
బిలో యావరేజ్‌ హీరో అయిపోతున్నాడు
X
స్టార్ హీరో - యావరేజ్ హీరో - చిన్న హీరో.. వసూళ్లను బట్టి ఇలా కేటగిరీలుగా లెక్కెట్టే సాంప్రదాయం టాలీవుడ్ లో ఎప్పటి నుంచో ఉంది. ఎంట్రీ లెవెల్ కి ఎక్కువ, స్టార్ స్టేటస్ కి తక్కువలో ఉన్న వాళ్లని యావరేజ్ గా జమ కడతారన్న విషయం తెలిసిందే. మరి హీరో రామ్ ఇప్పుడు ఏ కేటగిరిలోకి వస్తాడనేది టఫ్ క్వశ్చన్ గా చెప్పచ్చు. నిజానికి మొన్నటివరకూ ఈ కుర్రోడు యావరేజ్ హీరోనే కానీ.. ఇప్పుడు లెక్కలు మారిపోయాయి.

25 కోట్ల షేర్ సాధించి భలేభలే మగాడివోయ్ చిత్రంతో నాని ఓ సెన్సేషన్ క్రియేట్ చేశాడు. ఆ తర్వాత సుబ్రమణ్యం ఫర్ సేల్ మూవీతో 19 కోట్లకుపైగా షేర్ తో మెగా వారసుడు సాయిధరం తేజ్ డిపెండబుల్ హీరో అనిపించుకున్నాడు. మూడో సినిమాతోనే ఇంత షేర్ సాధించడం విశేషం. ఇక మరో కుర్రహీరో రాజ్ తరుణ్ కూడా కుమారి 21ఎఫ్ తో ఈ క్లబ్ లోకి ఎంటర్ అయిపోయాడు. అంటే మిడిల్ రేంజ్ హీరోలుగా కనీసం 15 కోట్ల పైన షేర్ సాధిస్తున్నారు. మరి ఈ మొత్తాన్ని కలెక్ట్ చేయడంలో రామ్ ఫెయిల్ అయ్యాడనే చెప్పాలి. ఈ హీరో లేటెస్ట్ మూవీ శివం తెలుగు రాష్ట్రాల్లో కలెక్ట్ చేసిన మొత్తం 5.73 కోట్ల రూపాయలు మాత్రమే. మొత్తంగా చూసుకున్నా 14.25 కోట్ల గ్రాస్, 6.68 కోట్ల షేర్ మాత్రమే వచ్చింది.

పైన చెప్పిన ముగ్గురి కంటే పెద్ద రేంజ్ ని ముందుగానే అందుకున్నాడు రామ్. ఇప్పుడు అర్జంట్ ఓ మాంచి హిట్ కొట్టి కనీసం 20 కోట్ల షేర్ సాధించాల్సిన అవసరం కనిపిస్తోంది. లేకపోతే. మీడియం హీరో స్టేటస్ నుంచి చిన్న హీరో అనిపించుకోవాల్సిన పరిస్థితి వచ్చేయచ్చు. మరి నేను శైలజతో తన స్థాయిని రామ్ ప్రూవ్ చేసుకుంటాడో లేదో ?