Begin typing your search above and press return to search.

‘రామసేతు’ తాజా అప్డేట్.. మరింత ఆసక్తికరంగా

By:  Tupaki Desk   |   23 Oct 2021 4:37 AM GMT
‘రామసేతు’ తాజా అప్డేట్.. మరింత ఆసక్తికరంగా
X
ఒకటి తర్వాత ఒకటి చొప్పున వరుస పెట్టి సినిమాల్ని చేయటంతో బాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరైన అక్షయ్ కుమార్ తీరు కాస్త భిన్నంగా ఉంటుంది. మిగిలిన స్టార్ హీరోల్లో ఎవరూ పాటించలేని క్రమశిక్షణ.. ప్లానింగ్ ఆయనలో కనిపిస్తూ ఉంటుంది.ప ఆయన సినిమాలు వరుసగా విడుదలవుతూ ఉంటాయి. తాను చేసే సినిమాల్ని భిన్నంగా ప్లాన్ చేయటంలో ఆయన మార్కు కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. తాజాగా ఆయన చేస్తున్న సినిమాల్లో రామసేతు ఒకటి.

ఈ మూవీలో అక్షయ్ పురావస్తు శాస్త్రవేత్తగా కనిపిస్తారు. ఇదే సినిమాల్లో విభిన్నమైన కథాంశాల్లో మూవీలు చేసే తెలుగు హీరో సత్యదేవ్ కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాకు బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ప్రధాన పాత్రను పోషిస్తున్నారు. అభిషేక్ శర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీకి సంబంధించిన షెడ్యూల్ ఊటీలో సాగుతోంది.

తాజాగా ఈ షెడ్యూల్ ముగిసింది. ఊటీకి టీం గుడ్ బై చెప్పేసింది. ఈ సందర్భంగా అక్షయ్ ఒక ఫోటోను తన సోషల్ మీడియాలో పోస్టు చేశారు. అందులో తాను.. జాక్వెలిన్ తో పాటు సత్యదేవ్ ఉన్న ఫోటోను పోస్టు చేసి.. ఆసక్తికర వ్యాఖ్య ఒకటి దానికి జోడించారు. ‘‘ఫోటోలో లేదా జీవితంలోచీకటి మేఘాలపై ఎప్పుడూ అందమైన కాంతి రేఖ ఉంటుంది’’ అని పేర్కొన్నారు. చూసినంతనే ఆకర్షించేలా ఉన్న ఈ ఫోటో.. సినిమా మీద మరింత ఆసక్తిని పెంచేలా మారింది.