Begin typing your search above and press return to search.

లక్కు కోసం హిట్టు హీరోయినే

By:  Tupaki Desk   |   19 May 2016 9:58 AM IST
లక్కు కోసం హిట్టు హీరోయినే
X
ఎనర్జిటిక్ హీరో రామ్ ఇప్పుడు కొంచెం స్లో అయ్యాడు. గతేడాది ఫ్లాపులు వెంటాడ్డంతో.. చాలా అలర్ట్ గా చేసి 'నేను శైలజ' హిట్ కొట్టాడు. 2016ను గ్రాండ్ గా స్టార్ట్ చేసిన రామ్.. ఆ తర్వాత ఇప్పటివరకూ సినిమా స్టార్ట్ చేయలేదు. స్టోరీ ఫైనల్ చేసుకున్నా.. హీరోయిన్ ని వేటాడ్డంలో మాత్రం బాగా ఆలస్యం జరిగింది.

రామ్ తో కందిరీగ హిట్ కొట్టిన సంతోష్ శ్రీనివాసన్ తో సినిమా ఖాయమైంది. ఈ మూవీలో హీరోయిన్ గా పలు ఆప్షన్స్ అనుకున్నాడు రామ్. తమన్నా - రాశి ఖన్నాలలో ఒకరికిన తీసుకునేందుకు ఉత్సాహం చూపించాడు. అయితే.. వీరిద్దరూ రామ్ కి ఫ్లాపులు ఇచ్చిన హీరోయిన్సే. దీంతో ఫ్లాప్ కాంబినేషన్స్ వద్దంటూ.. ఈ ఎనర్జిటిక్ హీరోకి సందేశాలు పంపారు ఫ్యాన్స్. దీంతో ఆలోచనలో పడ్డ రామ్.. చివరకు తనతో హిట్ సినిమాలో నటించిన హీరోయిన్ నే తెచ్చుకోవాలని డిసైడ్ అయ్యాడు.

యంగ్ సెన్సేషనల్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ తో.. రామ్ మరోసారి రొమాన్స్ చేసేందుకు సిద్ధమయ్యాడు. గతంలో వీరిద్దరూ కలిసి నటించిన పండగచేస్కో చిత్రం.. కంటెంట్ యావరేజ్ గా ఉన్నా.. మూవీ మాత్రం హిట్ కొట్టింది. వీళ్ల పెయిర్ చూడముచ్చటగా ఉండడం ఇందుకు కారణంగా చెప్పచ్చు. ఇప్పుడు అదే కాంబినేషన్ తో మూవీకి చేస్తున్నాడు రామ్.