Begin typing your search above and press return to search.

రామ్‌.. పూరి కొత్త ఇస్మార్ట్‌ మూవీ ఇంట్రెస్టింగ్‌ అప్డేట్‌

By:  Tupaki Desk   |   25 April 2023 3:44 PM IST
రామ్‌.. పూరి కొత్త ఇస్మార్ట్‌ మూవీ ఇంట్రెస్టింగ్‌ అప్డేట్‌
X
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్‌ కెరీర్‌ పరంగా ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటున్నాడు. విజయ్ దేవరకొండ తో భారీ అంచనాల నడుమ లైగర్ చిత్రాన్ని రూపొందించిన పూరి జగన్నాధ్ పాన్ ఇండియా రేంజ్ లో పరువు పోగొట్టుకున్నాడు. లైగర్ సినిమాను ఏ రేంజ్ లో జనాలు ట్రోల్స్ చేశారో ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు.

గత కొన్ని నెలలుగా తదుపరి ప్రాజెక్ట్‌ ను మొదలు పెట్టేందుకు పూరి జగన్నాధ్ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాడు. పలువురు హీరోలతో సంప్రదించేందుకు ప్రయత్నించగా కొందరు కనీసం కథలు వినేందుకు సమయం లేదు అంటూ మొహం చాటేశారట.. కొందరు మాత్రం పూరితో సినిమాకి ఓకే చెప్పినా కథ విషయంలో ఆసక్తి చూపించలేదని తెలుస్తోంది.

పూరి జగన్నాధ్ చివరకు రామ్‌ ను ఒప్పించాడట. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం రామ్ కు చాలా లైన్స్ చెప్పిన పూరి ఎట్టకేలకు ఓకే చెప్పించాడనే వార్తలు వస్తున్నాయి. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఇటీవల చెప్పిన ఒక కథకు రామ్‌ ఓకే చెప్పాడని... ప్రస్తుతం చేస్తున్న సినిమా పూర్తి అయిన తర్వాత చేద్దామని డేట్లు కూడా ఇచ్చాడని సమాచారం అందుతోంది.

అక్టోబర్‌ నుండి రామ్‌.. పూరి ల కాంబో సినిమా పట్టాలెక్కే అవకాశాలు ఉన్నాయి. అంతే కాకుండా ఇస్మార్ట్‌ శంకర్‌ సినిమా విడుదల అయిన జులై 18న ఈ కొత్త సినిమాను విడుదల చేయాలని భావిస్తున్నారు. ఇస్మార్ట్‌ శంకర్ సెంటిమెంట్ తో 2024 జులై 18న రామ్‌.. పూరి కాంబో మూవీ వచ్చి మంచి విజయాన్ని సొంతం చేసుకుంటుందేమో చూడాలి.

ఈ మధ్య కాలంలో రామ్‌ కూడా వరుసగా తన సినిమాలతో ఫెయిల్‌ అవుతూ వస్తున్నాడు. ఈ సమయంలో రామ్‌ కు కూడా ఒక సక్సెస్ అవసరం. ప్రస్తుతం చేస్తున్న బోయపాటి మూవీ పై చాలా నమ్మకంగా ఉన్నాడు. ఆ సినిమా హిట్ అయితే రామ్‌ స్పీడ్ పెంచే అవకాశాలు ఉన్నాయి. పూరితో చేయబోతున్న సినిమా కూడా హిట్ అయితే రామ్‌ ఫుల్ స్వింగ్ లో దూసుకు పోయే అవకాశాలు ఉన్నాయి.