Begin typing your search above and press return to search.
చెన్నైలో పుట్టి..ఒక్క తమిళ సినిమా కూడా చేయని హీరో!
By: Tupaki Desk | 11 May 2020 11:00 PM ISTమన టాలీవుడ్ హీరోలు ఈ మధ్య వేరే ఇండస్ట్రీల వైపు కూడా మొగ్గు చూపుతున్నారు. తెలుగుతో పాటు ఇతర ఇండస్ట్రీలలో మార్కెట్ పెంచుకోవడానికి అనేక ఆలోచనలు చేస్తున్నారు. ఇప్పటికే చాలామంది తెలుగు హీరోలు తమిళ ఇండస్ట్రీలో అరంగేట్రం చేసి వారి అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. తాజాగా తమిళ పరిశ్రమ పై దృష్టి పెట్టిన తెలుగు హీరోల జాబితాలోకి యంగ్ హీరో రామ్ కూడా చేరిపోయాడు. నిజానికి రామ్ తెలుగువాడే అయినా పుట్టి పెరిగిందంతా తమిళనాడులోనే. కానీ రామ్ హీరోగా మాత్రం తెలుగు ఇండస్ట్రీలో సెటిల్ అయ్యాడు. ఇండస్ట్రీకి వచ్చి పదేళ్ల పైబడినా ఒక్క సినిమా కూడా తమిళంలో చేయలేదు. ఎన్ని సినిమాలు తెలుగులో చేసినా ఊహ తెలిసినప్పటి నుండి మాట్లాడిన తమిళం పై మాత్రం మక్కువ పోలేదు.
తమిళం రానివాళ్లే తమిళంలో సెటిల్ అవ్వడానికి ప్రయత్నిస్తుంటే.. అక్కడే పుట్టి పెరిగిన వాడిని నేనెందుకు ట్రై చేయకూడదు అనుకున్నాడేమో.. ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో తను మాట నేర్చిన భాషపై మనసులో మాట బయట పెట్టాడు. ఇదివరకే నాని, నాగార్జున, విజయ్ దేవరకొండ, మహేష్ బాబు, సిద్దార్థ్, సందీప్ కిషన్.. ఇలా చాలామంది తమిళ ఇండస్ట్రీలో సినిమాలు చేసినవాళ్ళే. ఇక తాజాగా రామ్ మాట్లాడుతూ.. ఇన్నేళ్లు గడిచినా తమిళంలో ఒక్క సినిమా కూడా చేయలేకపోయాను. ప్రస్తుతం ఏదైనా మంచి తమిళ స్క్రిప్ట్ వస్తే చేయడానికి తను సిద్ధం అన్నట్లు తెలిపాడు. ఈ మాటలు ఎవరైనా తమిళ దర్శక నిర్మాతల చెవిలో పడిందేమో తెలియాల్సి ఉంది. ఇక రామ్ ప్రస్తుతం తమిళ సూపర్ హిట్ తడం మూవీని తెలుగులో రెడ్ పేరుతో రూపొందించిన సినిమాలో నటించారు. ఇక ఈ సినిమా ప్రస్తుతం విడుదలకు సిద్దంగా ఉందట. చూడాలి మరి తమిళ ఎంట్రీ ఎప్పుడు చేస్తాడో..!