Begin typing your search above and press return to search.

రాపో తిక్క పోలీస్ కాదు క్రాక్ పోలీస్ కాదు మ‌రేమిటి?

By:  Tupaki Desk   |   4 April 2021 6:00 PM IST
రాపో తిక్క పోలీస్ కాదు క్రాక్ పోలీస్ కాదు మ‌రేమిటి?
X
గ‌బ్బ‌ర్ సింగ్ లో తిక్క పోలీస్ ని.. ప‌టాస్ లో క్లెవ‌ర్ కామిక్ టైమింగ్ పోలీస్ ని.. క్రాక్ లో ప‌వ‌ర్ ఫుల్ ఈగోయిస్టిక్ పోలీస్ ని చూశాం. మ‌రి ఇప్పుడు లింగుస్వామి సినిమాలో పోలీస్ ఎలా ఉండ‌బోతున్నాడు? ఇంత‌కీ రాపోని స్వామి ఎలా చూపించ‌బోతున్నారు? అన్న ఉత్కంఠ ఎన‌ర్జిటిక్ రామ్ పోతినేని అభిమానుల్లో ఉంది.

ప్రేమ‌క‌థ‌ల్లో ఫ్రెండ్షిప్ క‌థ‌ల్లో రొమాంటిక్ ల‌వ‌ర్ పాత్రల్లో రామ్ ఇప్ప‌టికే మెప్పించారు. ఇటీవ‌ల ఇస్మార్ట్ శంక‌ర్ గా ప్ర‌యోగాత్మ‌క పాత్ర‌తోనూ మెప్పించాడు. కానీ ఇంకా అత‌డి ఇమేజ్ చాలా మారాల్సి ఉంది. లింగుస్వామి ప్ర‌స్తుతం ఆ ప్ర‌య‌త్నంలోనే ఉన్నార‌ట‌. ఇస్మార్ట్ శంకర్ - రెడ్ సినిమాల్లో మాస్ రోల్స్ చేయడానికి ప్రయత్నించిన రామ్ ఈసారి పోలీసాఫీస‌ర్ గా స‌రికొత్త లెవ‌ల్ ని ట‌చ్ చేయాల‌ని భావించి స్వామి క‌థ‌కు ఓకే చెప్పార‌ట‌. రామ్ ఇమేజ్ మారాల‌న్న దానిపై స్ర‌వంతి ర‌వికిషోర్ నుంచి స్ప‌ష్ఠ‌మైన ఆదేశాలు ఉన్నాయ‌ని తెలిసింది. కాప్ రోల్ ఎంపిక వెన‌క అభిమానుల‌ను పెంచుకోవ‌డంలో ప‌వ‌ర్ ని పుల్ చేయాల‌న్న పంతం ఉంద‌ట‌.

ఈ చిత్రంలో ఉప్పెన‌ ఫేమ్ కృతి శెట్టి నాయిక‌. రామ్ - కృతి జంట అటు త‌మిళ ఆడియెన్ కి ట్రీట్ ఇచ్చేది ఈ సినిమాతోనే కావ‌డంతో అక్క‌డా క్యూరియాసిటీ నెల‌కొన‌నుంది. లింగుస్వామి ఈ సినిమాతో ఆ ఇద్ద‌రికీ పెద్ద ఎలివేష‌న్ ఇస్తార‌ని అంచ‌నా వేస్తున్నారు.