Begin typing your search above and press return to search.

ఇంతకు వారియర్‌ ఫస్ట్‌ ఛాయిస్ రామ్ కదా..!

By:  Tupaki Desk   |   11 July 2022 2:30 AM GMT
ఇంతకు వారియర్‌ ఫస్ట్‌ ఛాయిస్ రామ్ కదా..!
X
ఎనర్జిటిక్ స్టార్‌ రామ్‌ హీరోగా రూపొందిన ది వారియర్ సినిమా ఈ వారం విడుదలకు రెడీ గా ఉంది. సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. రామ్‌ తో పాటు హీరోయిన్ కృతి శెట్టి సాధ్యం అయినంత ఎక్కువ ప్రమోషన్ ను సినిమాకు చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ సమయంలోనే ది వారియర్‌ సినిమా ను బన్నీ చేయాల్సిందనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

కొన్నాళ్ల క్రితం అల్లు అర్జున్ హీరోగా లింగుస్వామి దర్శకత్వంలో ఒక సినిమా రాబోతుందనే వార్తలు వచ్చాయి. ఇద్దరి మధ్య కథా చర్చలు జరిగాయి. తెలుగు మరియు తమిళంలో ఒకేసారి ఈ సినిమాను చేయాలని భావించారు. లింగు స్వామి బ్యాక్ టు బ్యాక్ ప్లాప్ లతో  బన్నీ వెనుకంజ వేశాడు అంటూ పుకార్లు గుప్పుమన్నాయి.

అల్లు అర్జున్‌ తో లింగు స్వామి చేయాలనుకున్న సినిమా కాస్త క్యాన్సిల్‌ అయ్యింది. ఈ సమయంలో అల్లు అర్జున్ పై ఆశలు వదిలేసుకున్న లింగు స్వామికి అనూహ్యంగా రామ్‌ ఓకే చెప్పాడని.. అలా అల్లు అర్జున్‌ చేయాల్సిన కథను కాస్త రామ్‌ చేస్తున్నాడని ఇండస్ట్రీలో ఒక వార్త చక్కర్లు కొడుతోంది. ఇండస్ట్రీలో ఇలాంటి సంఘటనలు చాలా జరుగుతూనే ఉంటాయి.

చాలా సార్లు ఇలా చేతులు మారిన కథలు సూపర్ హిట్ అయిన దాఖలాలు చాలా ఉన్నాయి. పవన్ కళ్యాణ్ వద్దన్న కథలు రవితేజ చేసి సూపర్ హిట్‌ దక్కించుకున్నట్లుగా బన్నీ కాదుకున్న ది వారియర్ సినిమా ను ఇప్పుడు రామ్‌ చేసి సూపర్‌ హిట్‌ ను అందుకోబోతున్నాడేమో చూడాలి.

అల్లు అర్జున్‌ ది వారియర్‌ వదులుకోవడంకు కారణాలు అనేకం ఉన్నాయి. అందులో పుష్ప కూడా ఒకటి అనే ప్రచారం జరుగుతోంది. పుష్ప సినిమా రెండు పార్ట్ లుగా చేస్తున్న నేపథ్యంలో వచ్చే ఏడాది వరకు ఆయన మరే సినిమాకు కమిట్‌ అయ్యే పరిస్థితి లేదు. దానికి తోడు ఇప్పటికే మరి కొన్ని సినిమాలకు ఆయన కమిట్‌ అయ్యాడు. కనుక వారియర్ ను మరెవ్వరితో అయినా చేసుకునేందుకు లింగు స్వామి కి ఓకే చెప్పి ఉంటాడు అనేది కొందరి అభిప్రాయం.