Begin typing your search above and press return to search.

మీకు ఈ సినిమాతో జాతీయ అవార్డు రావాలిః రామ్‌

By:  Tupaki Desk   |   8 March 2021 3:32 AM GMT
మీకు ఈ సినిమాతో జాతీయ అవార్డు రావాలిః  రామ్‌
X
శ్రీ విష్ణు హీరోగా అనీల్ రావిపూడి సమర్పణలో అనీష్‌ కృష్ణ దర్శకత్వంలో రూపొందిన 'గాలి సంపత్‌' సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అయ్యింది. ఈ వారంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న గాలి సంపత్ సినిమా లో శ్రీ విష్ణు తో పాటు చాలా కీలకమైన పాత్రలో రాజేంద్ర ప్రసాద్‌ కనిపించబోతున్నాడు. ట్రైలర్‌ ను చూస్తుంటే సినిమా మొత్తం ఆయన చుట్టు తిరుగుతుందని అనిపిస్తుంది. మాటలు సరిగా పలకలేని ఒక వ్యక్తి గా రాజేంద్ర ప్రసాద్ కనిపించబోతున్నాడు. ఆయన ఈ సినిమా లో చేసే సందడి ప్రేక్షకులకు నవ్వు తెప్పించే విధంగా ఉంటుందని అంటున్నారు.

సినిమా విడుదల తేదీ సమీపిస్తున్న నేపథ్యంలో ప్రీ రిలీజ్ వేడుకను హైదరాబాద్‌ లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రామ్‌ ముఖ్య అతిథిగా హాజరు అయ్యాడు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. మా స్రవంతి మూవీస్ బ్యానర్‌ రాజేంద్ర ప్రసాద్ గారి సినిమాతో ప్రారంభం అయ్యింది. నా చిన్నతనం మొత్తం కూడా ఆయన జ్ఞాపకాలతో ఉంటుంది. ఆయన ఇండస్ట్రీకి ఒక నిధి వంటి వారు. ఈ సినిమాలోని కొన్ని సీన్స్‌ ను నేను చూశాను. ఖచ్చితంగా ఈ సినిమా కు ఆయన జాతీయ అవార్డును దక్కించుకోవాలని కోరుకుంటున్నాను అన్నాడు. ఇక హీరో శ్రీ విష్ణు గురించి మాట్లాడుతూ ఇండస్ట్రీలో కొద్ది మంది మాత్రమే నిజాయితీగా అనిపిస్తారు అందులో శ్రీవిష్ణు ఒకరు అన్నాడు. అనీల్ రావిపూడి స్క్రీన్‌ ప్లే అవ్వడంతో సినిమా పై భారీ అంచనాలున్నాయి. మరి ఆ అంచనాలను అందుకుంటుందా అనేది చూడాలి.