Begin typing your search above and press return to search.

ఒళ్ళు హూనం అయిందంటున్న ఇస్మార్ట్ హీరో!

By:  Tupaki Desk   |   26 Dec 2019 10:08 AM GMT
ఒళ్ళు హూనం అయిందంటున్న  ఇస్మార్ట్ హీరో!
X
పూరి జగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కిన 'ఇస్మార్ట్ శంకర్' తో ఎనర్జిటిక్ స్టార్ రామ్ ఒక సూపర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈమధ్య కాలంలో సరైన హిట్ లేక కెరీర్ లో ఇబ్బంది పడుతున్న రామ్ కు ఒక్కసారిగా పెద్ద రిలీఫ్ దక్కింది. దీంతో రెట్టించిన ఉత్సాహంతో తన తదుపరి చిత్రం 'రెడ్' షూటింగ్ లో పాల్గొంటున్నారు.

'నేను శైలజ' ఫేం కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను రామ్ పెదనాన్న స్రవంతి రవి కిషోర్ గారు స్రవంతి క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోందట. ప్రముఖ స్టంట్ మాస్టర్ పీటర్ హెయిన్ ఆధ్వర్యంలో యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారట. రామ్ ఎంత ఎనర్జిటిక్ అయినప్పటికీ రామ్ కు ఛాలెంజింగ్ గా ఉండే యాక్షన్ సీన్స్ డిజైన్ చెయ్యడంతో రామ్ కు గాయాలు కూడా అవుతున్నాయట. ఈ విషయం తెలుపుతూ రామ్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఒక వీడియో పోస్ట్ చేస్తూ "డియర్ పీటర్ హెయిన్.. మీరు నాకు ఇచ్చే పెయిన్ లాగే మీకు నామీద ఉండే ప్రేమను ఫీల్ కాగలం కానీ చూడలేం. నోట్:రషెస్ ఇప్పుడే చూశాను. మైండ్ బ్లోయింగ్" అంటూ ట్వీట్ చేశారు.

ఈ వీడియోలో రామ్ తన గాయాలను చూపిస్తూ "హే పీటర్ హెయిన్ నువ్వు నిన్న డిజైన్ చేసింది గ్రేట్ ఫైట్. నిన్ను నేను అసలు మిస్ కావడం లేదని చెప్పడానికే ఈ వీడియో చేశాను" అన్నాడు. అంటే ఇంకా ఆ ఫైట్ కు సంబంధించిన నొప్పులు తగ్గలేదన్నమాట. మొత్తానికి రామ్ ను పీటర్ హెయిన్ అంత కష్టపెడుతున్నాడన్నమాట. ఇక 'రెడ్' సినిమాలో రామ్ తొలిసారిగా ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఈ సినిమాకు మణి శర్మ సంగీత దర్శకుడు.