Begin typing your search above and press return to search.

రీమేక్ ను పక్కన పెట్టేసాడా?

By:  Tupaki Desk   |   2 Sep 2019 4:23 AM GMT
రీమేక్ ను పక్కన పెట్టేసాడా?
X
'ఇస్మార్ట్ శంకర్'తో వరుస ప్లాపులకు చెక్ పెట్టేసి బిగ్గెస్ట్ హిట్ అందుకున్న రామ్ పోతినేని ప్రస్తుతం అయోమయంలో ఉన్నాడు. ప్రతీ సినిమాకు కొంచెం టైం తీసుకుంటూ పక్కాగా ముందుకెళ్లే రామ్ 'ఇస్మార్ట్ శంకర్' తర్వాత అయినా స్పీడ్ పెంచుతాడనుకుంటే మళ్లీ అదే గ్యాప్ మైంటైన్ చేస్తున్నాడు. 'ఇస్మార్ట్ శంకర్' విడుదలై 50 రోజులు కావొస్తున్నా ఇంతవరకూ నెక్స్ట్ సినిమాను స్టార్ట్ చేయలేదు రామ్.

'ఇస్మార్ట్ శంకర్' తర్వాత 'తడం' అనే తమిళ సినిమాను తెలుగులో రీమేక్ చేయాలని అనుకున్నాడు రామ్. కానీ 'ఇస్మార్ట్ శంకర్' సక్సెస్ మాస్ ఇమేజ్ పెంచడంతో ఇప్పుడు అయోమయంలో పడ్డాడు కుర్ర హీరో. ప్రస్తుతానికి రామ్ తడం రీమేక్ ను పక్కనపెట్టేసి మరో కథను ఫైనల్ చేసే పనిలో ఉన్నాడని తెలుస్తుంది. ముందుగా ఇంకో మాస్ కమర్షియల్ సినిమా చేసి ఆ తర్వాత రీమేక్ సినిమాను చేయాలని డిసైడ్ అయ్యాడట. త్వరలోనే మరో మాస్ సినిమాతో సెట్స్ పైకి వస్తాడట.

నిజానికి పూరి జగన్నాథ్ రామ్ ని ఊర మాస్ క్యారెక్టర్ లో ప్రెజెంట్ చేసి ఎవరెస్ట్ అంచులో కూర్చుబెట్టాడు. ఇప్పుడు దాన్ని అందుకోవడం రామ్ కి చాలా కష్టంగా మారింది. అందుకే ఎప్పటిలాగే సక్సెస్ వచ్చినా ఇస్మార్ట్ శంకర్ ని మైమరిపించేలా సబ్జెక్ట్ రెడీ చేయించుకుంటున్నాడు. రామ్ నెక్స్ట్ డైరెక్టర్ ఎవరన్నది తెలియదు కానీ నిర్మాణం మాత్రం స్రవంతి మూవీస్ లొనే ఉండనుంది.