Begin typing your search above and press return to search.

వీడియో : ఎనర్జిటిక్‌ స్టార్‌ రామ్‌ ఫస్ట్‌ ఎండార్స్మెంట్

By:  Tupaki Desk   |   6 Oct 2020 9:15 AM IST
వీడియో : ఎనర్జిటిక్‌ స్టార్‌ రామ్‌ ఫస్ట్‌ ఎండార్స్మెంట్
X
ఒకప్పుడు మోడల్స్‌ మాత్రమే బ్రాండ్స్‌ కు ఎండార్స్మెంట్‌ చేసే వారు. కాల క్రమేనా సినీ తారలు క్రీడాకారులు ప్రముఖ సెలబ్రెటీలతో తమ కంపెనీలకు ప్రచారం చేయిస్తూ వచ్చారు. ఇప్పుడు బాలీవుడ్‌ టాలీవుడ్‌ అనే తేడా లేకుండా అన్ని చోట్ల కూడా స్టార్‌ హీరోలు హీరోయిన్స్‌ బ్రాండ్స్‌ ప్రమోషన్‌ లో పాల్గొంటున్నారు. టాలీవుడ్‌ లో అత్యధికంగా మహేష్‌ బాబు ప్రచారకర్తగా వ్యవహరిస్తున్నారు. మరికొందరు స్టార్స్‌ కూడా వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ యాడ్స్‌ లో కనిపిస్తున్నారు. తాజాగా ఎనర్జిటిక్‌ స్టార్‌ రామ్‌ కూడా కమర్షియల్‌ యాడ్‌ లో కనిపించాడు. బాలీవుడ్‌ స్టార్‌ నటుడు జాన్‌ అబ్రహంతో కలిసి రామ్‌ నటించిన ఈ కమర్షియల్‌ యాడ్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

గార్నియర్ కు సంబంధించిన యాడ్‌ లో జాన్‌ అబ్రహం మరియు రామ్‌ లు కలిసి నటించారు. ఇదుగో నా మొదటి కమర్షియల్‌ యాడ్‌. గార్నియర్‌ వారితో అసోషియేట్‌ అవ్వడం పట్ల చాలా సంతోషంగా ఉంది. షూటింగ్‌ మరియు డబ్బింగ్‌ సమయంలో చాలా ఎంజాయ్‌ చేశాను. ఈ అనుబంధం ముందు ముందు కూడా కొనసాగాలని కోరుకుంటున్నాను అంటూ రామ్‌ ట్వీట్‌ చేశాడు.

రామ్‌ ఈ ఒక్క బ్రాండ్‌ తోనే ఆపేస్తాడా ముందు ముందు మరిన్ని కమర్షియల్‌ లలో కనిపిస్తాడా అనేది చూడాలి. ఇక రామ్‌ నటించిన రెడ్‌ సినిమా విడుదలకు సిద్దంగా ఉంది. ఆ సినిమాకు సంబంధించిన విడుదల తేదీ అతి త్వరలో వచ్చే అవకాశం ఉంది. లాక్‌ డౌన్‌ కారణంగా ఆగిపోయిన ఆ సినిమా థియేటర్ల పునః ప్రారంభంకు అంతా ఓకే చెప్పిన నేపథ్యంలో ఎట్టకేలకు విడుదల అవ్వబోతుంది.