Begin typing your search above and press return to search.

#WFH క‌వ‌ర్.. క్లాసీ లుక్ తో #RAPO చించాడుగా

By:  Tupaki Desk   |   2 Nov 2020 9:30 AM IST
#WFH క‌వ‌ర్.. క్లాసీ లుక్ తో #RAPO చించాడుగా
X
టాలీవుడ్ లో రేర్ ఎన‌ర్జిటిక్ హీరోగా #RAPO కి ఉన్న ఇమేజ్ గురించి చెప్పాల్సిన ప‌నే లేదు. క్లాస్ మాస్ లుక్ ఏదైనా అద‌ర‌గొట్టేస్తాడు. రెండు డిఫ‌రెంట్ యాటిట్యూడ్స్ ని టైమింగుని బ‌ట్టి ప్రెజెంట్ చేయ‌డంలో అత‌డి ప‌నిత‌నాన్ని మెచ్చుకుని తీరాల్సిందే.

ఇటీవ‌లే ఇస్మార్ట్ శంక‌ర్ చిత్రంలో ప‌క్కా నైజాం యాస‌తో మాస్ ధ‌మ్కీ ఇస్మార్ట్ కుర్రాడిగా అద‌ర‌గొట్టిన రామ్ ప్ర‌స్తుతం రెడ్ లో ద్విపాత్రాభిన‌యంతో దుమారం రేప‌డానికి రెడీ అవుతున్నాడు.

యాక్షన్ థ్రిల్లర్ ఫార్మాట్ లో తెర‌కెక్కుతున్న రెడ్ సంక్రాంతి బ‌రిలో థియేటర్లలో విడుదల అవుతుందని నిర్మాత‌లు అధికారికంగా ధృవీకరించారు. ఇప్ప‌టికే రెడ్ ప్ర‌చారం హోరెత్తిస్తున్న సంగ‌తి తెలిసిన‌దే.

ఈలోగానే రామ్ లేటెస్ట్ మ్యాగ‌జైన్ క‌వ‌ర్ షూట్ సంచ‌ల‌నంగా మారింది. వైట్ ష‌ర్ట్ బ్లాక్ ఫ్యాంటుతో స్పెష‌ల్ డిజైన‌ర్ లుక్ లో క‌నిపించాడు రామ్. అతను నిజంగా క్లాసీగా కనిపిస్తున్నాడు. సింపుల్ ట్రిమ్డ్ గడ్డంతో చక్కగా కనిపిస్తున్నాడు. స్వ‌త‌హాగానే అంద‌గాడైన రామ్ కి ఈ లుక్ వంద శాతం యాప్ట్ అయ్యింద‌నే చెప్పాలి.

``నేను పనిలో ఉన్నాను..ఇంట్లోనే ఉన్నాను..ఒక ఫార్మల్..గో ఈజీ .. #WFH లుక్. లవ్ .. # రాపో`` అంటూ రామ్ ఈ ఫోటోలకు క్యాప్షన్ పెట్టాడు. అతను నిజంగా ఇంటి నుండి పని చేస్తున్న సాఫ్ట్ వేర్ ఇంజినీర్ లాగే ఉన్నాడు మ‌రి. రామ్ న‌టించిన రెడ్ పై ఇప్ప‌టికే అభిమానుల్లో అంచ‌నాలేర్ప‌డ‌న సంగ‌తి తెలిసిందే. కిషోర్ తిరుమ‌ల ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.