Begin typing your search above and press return to search.
పవన్ నో చెబితే.. రామ్ ఎస్ అన్నాడా?
By: Tupaki Desk | 15 Feb 2020 9:00 PM ISTఒక స్టార్ కోసం అనుకున్న స్క్రిప్ట్ ఇంకో స్టార్ కి షిఫ్టవ్వడం రెగ్యులర్ గా చూసేదే. అందుకు రకరకాల కారణాలు ఉంటాయి. తాజాగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ స్క్రిప్ట్.. `రెడ్` స్టార్ రామ్ కి షిఫ్టయ్యిందన్న టాక్ ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుస కమిట్ మెంట్ల పరంపరలో దర్శకుడు బాబి పేరు తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కమిట్ అయిన మూడు సినిమాలు పూర్తిచేసి...అటుపై బాబి...పూరి జగన్నాథ్ లతో పవన్ సినిమాలు చేయడానికి ఆసక్తిగా ఉన్నారని ప్రచారమైంది. గతంలో ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం కోసమైనా వారితో సినిమాలు చేస్తాడని భావిస్తున్నారు. పవన్ 29వ సినిమా బాబితోనూ...ల్యాండ్ మార్క్ 30వ చిత్రాన్ని పూరితో పూర్తిచేసి లెక్కలు సరిచేస్తాడని బలమైన కథనాలే వెలువడ్డాయి. తాజాగా దీనిపై మరో ఇంట్రెస్టింగ్ అప్ డేట్ అందింది.
`సర్ధార్ గబ్బర్ సింగ్` ఫేం బాబి ఇటీవలే పవన్ ని కలిసి లైన్ వినిపించాడుట. కానీ ఆ లైన్ పవన్ ని అంతగా ఇంప్రెస్ చేయలేదని.. దీంతో బాబిని తాత్కలికంగా హోల్డ్ లో పెట్టారని ఇన్ సైడ్ టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యం లో అదే లైన్ ని ఎనర్జిటిక్ స్టార్ రామ్ కి బాబీ వినిపంచాడుట. రామ్ మాత్రం ఆసక్తి చూపించాడని తన సన్నిహిత వర్గాలు రివీల్ చేశాయి. బౌండ్ స్క్రిప్ట్ సిద్దం చేసి మరోసారి కలవమని రామ్ చెప్పాడుట. దీంతో బాబి ఎనర్జిటిక్ స్టార్ కాల్షీట్లు దక్కించుకున్నట్టేనని ప్రచారం సాగుతుంది. రామ్ ఇస్మార్ట్ శంకర్ విజయంతో కెరీర్ పరంగా బౌన్స్ బ్యాక్ అయ్యాడు. వరుస పరాజాయాల తర్వాత వచ్చిన సక్సెస్ అది. దీంతో కథలు.. దర్శకుల ఎంపికలో ఎక్స్ ట్రా కేర్ తీసుకుంటున్నాడు.
కొత్త దర్శకులకు ఛాన్స్ ఇవ్వకుండా అనుభవం సక్సెస్ ఉన్న దర్శకులకే ఛాన్స్ ఇస్తున్నాడు. ప్రస్తుతం కిషోర్ తిరుమల దర్శకత్వంలో `రెడ్` సినిమాలో నటిస్తున్నాడు. అన్ని అనుకున్నట్లు గనుక జరిగితే బాబి సినిమా రెడ్ తర్వాత పట్టాలెక్కే ఛాన్స్ ఉందని సన్నిహిత వర్గాలు అంటున్నాయి. అయితే అంతకు ముందే బాబి బౌండెడ్ స్క్రిప్ట్ తో ఇస్మార్ట్ రామ్ ని మెప్పించాల్సి ఉంటుంది. ఇటీవలే బాబి వెంకీమామ చిత్రంతో సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే.