Begin typing your search above and press return to search.

'రెడ్' విషయంలో ఎలాంటి డైలమా లేదంటున్న #RAPO..!

By:  Tupaki Desk   |   11 April 2020 2:39 PM GMT
రెడ్ విషయంలో ఎలాంటి డైలమా లేదంటున్న #RAPO..!
X
'ఇస్మార్ట్ శంకర్‌' సూపర్ హిట్‌తో మంచి ఊపు మీదున్నాడు ఎనర్జిటిక్ స్టార్ రామ్. ఇప్పటి వరకు మాస్ చిత్రాలను టచ్ చేయని చాక్లెట్ బాయ్ రామ్.. ఫస్ట్ టైం ఫుల్ మాస్ లుక్‌లో అదరగొట్టేశాడు. అటు దర్శకుడిగా పూరీ జగన్నాథ్.. ఇటు హీరోగా రామ్ కెరీర్‌లో నిలిచిపోయే చిత్రంగా మిగిలింది. ఈ సినిమా సక్సెస్ ఎంజాయ్ చేసిన రామ్ పోతినేని వెంటనే క్రైమ్ థ్రిల్లర్ 'రెడ్' సినిమాను పట్టాలెక్కించాడు. ఈ చిత్రానికి కిశోర్ తిరుమల దర్శకత్వం వహిస్తున్నారు. కరోనా భయం లేకుంటే ఈ 'రెడ్' ఈపాటికి థియేటర్లలో సందడి చేస్తూ ఉండేది. ఏప్రిల్‌లో రిలీజ్ కావలసిన ఈ చిత్రం లాక్‌ డౌన్ కారణంగా వాయిది పడింది. అయితే ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో మూవీని డిజిటిల్ స్ట్రీమింగ్స్‌లో విడుదల చేస్తారని ప్రచారం జరిగింది. ఈ 'రెడ్' చిత్రానికి ఓటీటీ ఫ్లాట్‌ ఫామ్‌ లో మంచి ధర వచ్చిందని అందులో రిలీజ్ చేద్దామా వద్దా అనే డైలామాలో ఉన్నట్టు రూమర్స్ వచ్చాయి.

ఈ నేపథ్యంలో 'రామ్ డైలమాలో ఉన్నాడా?' అని ఓ వార్త పత్రికల్లో వచ్చింది. ఆ వార్తను పోస్టు చేస్తూ ఓ అభిమాని... 'రామ్ డైలమాలో ఉన్నాడా ? ఎంత లేట్ అయినా పర్లేదు అన్నా. సినిమాని థియేటర్‌లో రిలీజ్ చేయండి. థియేటర్స్‌లో వచ్చే వరకు మేం అదే ప్రేమతో, ఓపికతో ఉంటాం' అని తన కామెంట్‌లో తెలిపాడు. అభిమాని ట్వీట్‌కు స్పందించిన రామ్ డైలమాలో ఏ మాత్రం లేనని ట్వీట్ చేశాడు. వాస్తవంగా చెప్పాలంటే ప్రభుత్వ నిబంధనలకు లోబడి సామాజిక దూరం పాటిస్తూ.. హోమ్ క్వారంటైన్ (దాదాపు 15 ఏళ్లుగా చేస్తూనే ఉన్నాను)లో ఉన్నాను. నా ఫ్యాన్స్ RED సినిమాను బిగ్ స్క్రీన్‌లో చూడాలని ఎదురుచూస్తున్నానంటూ ట్వీట్ చేశాడు. మరికొందరు అభిమానులు ఈ సినిమాకి సంభందించి పోస్టర్ అయినా రిలీజ్ చేయండి అన్నా అంటూ రామ్‌ను రిక్వెస్ట్ చేస్తున్నారు.

శ్రీ స్రవంతి మూవీస్ బ్యానర్‌పై 'స్రవంతి' రవికిషోర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మణిశర్మ సంగీతం సమకూరుస్తున్నారు. పీటర్ హెయిన్స్ యాక్షన్ సీన్స్ డైరెక్ట్ చేస్తున్నారు. గత ఏడాది ప్రారంభమైన ఈ చిత్రం తమిళ మూవీ 'తదమ్' స్టోరీ లైన్ ఆధారంగా రూపొందింది. సినిమా టైటిల్ మాదిరిగానే కథ - కథనం కూడా చాలా కొత్తగా ఉంటాయని దర్శకుడు తిరుమల కిషోర్ వెల్లడించారు. వీరి కాంబినేషన్ లో వస్తున్న హ్యాట్రిక్ మూవీ 'రెడ్'. ఇంతక ముందు 'నేను శైలజ' - 'ఉన్నది ఒకటే జిందగీ' చిత్రాలు వచ్చాయి. 'ఇస్మార్ట్ శంకర్' సినిమా తర్వాత రామ్ నుండి వస్తున్న సినిమా కావడంతో భారీ అంచనాలే ఉన్నాయి. తమిళ్ లో సూపర్ హిట్ అయిన ఈ సినిమా తెలుగులో ఎలాంటి ఫలితాన్ని పొందబోతుందో తెలియాలంటే రామ్ చెప్పినట్టు థియేటర్లలో రిలీజయ్యే దాకా వెయిట్ చేయాల్సిందే.