Begin typing your search above and press return to search.

డబుల్ ఇస్మార్ట్.. హిట్ కాంబినేషన్ రిపీట్!

By:  Tupaki Desk   |   14 May 2023 10:30 PM IST
డబుల్ ఇస్మార్ట్.. హిట్ కాంబినేషన్ రిపీట్!
X
ఆ మధ్య వరుస పరాజయాలతో ఇబ్బందులు పడిన టాలీవుడ్ డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్‌.. దాదాపుగా అదే పరిస్థితిని ఎదుర్కొన్న ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేనిని ఒకేసారి హిట్ ట్రాక్ ఎక్కించిన చిత్రం 'ఇస్మార్ట్ శంకర్'. ఏమాత్రం అంచనాలు లేకుండానే వచ్చిన ఈ మాస్ ఎంటర్‌టైనర్ మూవీ భారీ కలెక్షన్లతో అద్భుతమైన విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే.

'ఇస్మార్ట్ శంకర్' హిట్ తర్వాత దీనికి సీక్వెల్‌గా 'డబుల్ ఇస్మార్ట్' మూవీని చేస్తామని అప్పట్లోనే దర్శకుడు పూరీ జగన్నాథ్ వెల్లడించాడు. కానీ, ఎవరికి వాళ్లు తమ తమ ప్రాజెక్టులతో బిజీగా ఉండడంతో ఈ ప్రాజెక్టు పట్టాలెక్కలేదు. ఇలాంటి పరిస్థితుల్లో రెండు రోజుల క్రితమే ఉస్తాద్ రామ్ - పూరీ జగన్నాథ్ కాంబోలో మరో సినిమా రాబోతుందని అధికారిక ప్రకటన వెలువడింది.

ముందుగా ప్రకటించిన ప్రకారమే పూరీ జగన్నాథ్ - రామ్ పోతినేని కలిసి చేస్తోన్న మరో సినిమాకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్‌ తాజాగా వెలువడింది. వీళ్లిద్దరి డ్రీమ్ ప్రాజెక్టు 'డబుల్ ఇస్మార్ట్'ను చేస్తున్నారు. రామ్ పుట్టినరోజు (మే 15) సందర్భంగా ఈ మూవీకి సంబంధించిన టైటిల్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో శివలింగం, త్రిశూలం మాత్రమే చూపించారు.

సక్సెస్‌ఫుల్ కాంబినేషన్‌లో రాబోతున్న 'డబుల్ ఇస్మార్ట్' మూవీని పాన్ ఇండియా రేంజ్‌లో తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం, హిందీ భాషల్లో రూపొందిస్తోన్నారు. దీన్ని పూరీ కనెక్ట్స్ బ్యానర్‌పై పూరీ జగన్నాథ్, చార్మీ కౌర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అంతేకాదు, ఇంకా షూటింగ్ మొదలు కాని ఈ సినిమాను వచ్చే ఏడాది మార్చి 8వ తేదీన రిలీజ్ చేస్తామని ప్రకటించారు.

ఇదిలా ఉండగా.. ఉస్తాద్ రామ్ పోతినేని హీరోగా పూరీ జగన్నాథ్ తెరకెక్కించే ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్టు వర్క్ దాదాపుగా పూర్తైనట్లు తెలిసింది. మిగిలిన ప్రీ ప్రొడక్షన్ వర్క్‌ను కూడా పూర్తి చేసుకుని ఈ సినిమాను ఈ ఏడాది జూలైలో లేదా ఆగస్టులో ప్రారంభిస్తారని అంటున్నారు. ఇక, ఇందులో నటించే నటీనటులు, టెక్నీషియన్ల వివరాలను త్వరలోనే ప్రకటిస్తారని చిత్ర యూనిట్ సభ్యులు తెలిపారు.