Begin typing your search above and press return to search.
టిప్పు సుల్తాన్... రజనీకి తిప్పలే
By: Tupaki Desk | 12 Sept 2015 5:00 PM ISTఆమధ్య రజనీకాంత్ టిప్పు సుల్తాన్ అనే ఓ సినిమా లో నటించబోతున్నట్లు కోలీవుడ్ లో జోరుగా ప్రచారం సాగింది. కర్ణాటక రాష్ర్టం మైసూర్ కు చెందిన అశోక్ టిప్పు సుల్తాన్ జీవితం ఆధారంగా సినిమా తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నారని కథనాలు వచ్చాయి. అయితే ఆసమయంలో రజనీ ఆరోగ్యం సక్రమంగా లేకపోవడంతో ఈ వార్తలకు బ్రేక్ పడింది. తాజాగా రజనీ పూర్తి ఆరోగ్యంతో హుషారుగా షూటింగుల్లో పాల్గొంటున్నారు. మళ్లీ గత వైభవాన్ని తీసుకురావాలన్న ఉద్దేశంతో కథలను సెలెక్టివ్ గా ఎంపిక చేసుకుని ముందుకెళుతున్నారు. ఇప్పటికే కబాలి అనే డాన్ క్యారెక్టర్ లో చేస్తున్నారు. ఇప్పడు లేటెస్ట్ టాపిక్ టిప్పు సుల్తాన్....
ఇప్పటికే కథ పూర్తిగా విన్న రజనీ టిప్పు సుల్తాన్ కు ఓకే చెప్పేసారని ప్రచారం సాగతుతోంది. అయితే ఈ కథలో రజనీ నటించడానికి వీలు లేదంటూ హిందూ సంఘాలు ఆందోళను చేపడుతున్నాయి. హిందూ మున్నని నేత రామ్ గోపాల్ రజనీ టిప్పు పాత్రలో నటించకూడదంటూ పరోక్షంగా హెచ్చరికలు జారీ చేశారు. టిప్పు కథలో రజనీ నటిస్తే తమిళుల్ని అవమానించినట్లేనని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యతిరేకంగా వెళితే కబడ్ధార్ అంటూ రజనీకి అల్టిమేటమ్ ఇచ్చారు.
తమిళులను - హిందువులను టిప్పు అష్టకష్టాలకు గురిచేసిన వివరాలు చరిత్ర పుస్తకాల్లో స్పష్టంగా ఉంది. ఈ నేపథ్యంలో ఈ విషయం దేశమంతటా దావానాలా వ్యాపించేసింది. రాజకీయ నేతలకు కూడా ఈ విషయం చేరిందని రామ్ గోపాలన్ స్పష్టం చేశారు. దీంతో టిప్పు సుల్తాన్ గా రజనీకాంత్ నటిస్తే చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని అర్థమవుతోంది. సూపర్ స్టార్ ఏం చేస్తారో వేచి చూడాల్సిందే