Begin typing your search above and press return to search.

త‌న త‌ల్లి సోద‌రుడికి కోవిడ్.. భ‌య‌మేసింద‌న్న రాపో

By:  Tupaki Desk   |   19 Dec 2020 4:45 PM IST
త‌న త‌ల్లి సోద‌రుడికి కోవిడ్.. భ‌య‌మేసింద‌న్న రాపో
X
కరోనా మ‌హ‌మ్మారీ సామాన్యులు సెల‌బ్రిటీలు అనే తేడా లేకుండా అంద‌రినీ భ‌య‌పెట్టేసింది. ప్రజల జీవితాలను మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా అనేక మంది ప్రముఖులను ఇది ప్రభావితం చేసింది. టాలీవుడ్ హీరో రామ్ తన తల్లి .. సోదరుడు కృష్ణ చైతన్య ల‌కు వైర‌స్ సోకింద‌ని దానికి చికిత్స తీసుకున్నార‌ని తాజా ఇంటర్వ్యూలో వెల్ల‌డించారు.

నిర్మాత అయిన తన సోదరుడు తల్లి ఇద్దరూ కోవిడ్ -19 బారిన పడినప్పుడు చాలా భయప‌డ్డాన‌ని రామ్ చెప్పాడు. “నా సోదరుడికి ముఖ్యంగా చాలా తీవ్ర లక్షణాలు క‌నిపించాయి. చికిత్స‌కు స్పందించి అతను పూర్తిస్థాయిలో కోలుకోగలిగాడు” అని రామ్ తెలిపారు.

మొత్తానికి టీకా వచ్చేవరకు బయటకు వెళ్లి పని చేయాలంటే రాపో అశ్ర‌ద్ధ చేయ‌క‌ ఇంకా జాగ్రత్తగా ఉంటాడు. రామ్ న‌టిస్తున్న థ్రిల్లర్ మూవీ రెడ్ కోవిడ్ లాక్ డౌన్ వ‌ల్ల‌నే ఆల‌స్య‌మైంది. సంక్రాంతి బ‌రిలో క్రాక్ తో పాటు పోటీప‌డే చిత్రాల్లో రెడ్ పేరు వినిపిస్తోంది. దీనిపై మ‌రోసారి చిత్ర‌బృందం నుంచి అధికారిక ప్ర‌క‌ట‌న వెలువ‌డాల్సి ఉంటుంది.