Begin typing your search above and press return to search.

హైపర్ అసలు వస్తోందా? రావట్లేదా?

By:  Tupaki Desk   |   13 Sept 2016 11:00 PM IST
హైపర్ అసలు వస్తోందా? రావట్లేదా?
X
ఏదైనా సినిమాకు కేవలం రిలీజుకు ఒక వారం ముందు ప్రమోషన్లు మొదలెడితే చాలు. ఇవి ఒకప్పటి ఫార్ములాలు. ఇప్పుడు సాక్షాత్తూ మహేష్‌ బాబు - అల్లు అర్జున్ వంటి స్టార్లే తమ సినిమాలను స్వయంగా ఇంటర్యూలు ఇస్తూ ఏకంగా 15 రోజులు ప్రమోట్ చేసుకుంటున్నారు. అది కాకుండా మూవీ రిలీజ్ కు ఒక నెల ముందు ఆడియో లాంచ్.. ఆడియో లాంచ్ కు ఒక నెల ముందు నుండే టీజర్లు - టీజర్ పోస్టర్లు అంటూ రచ్చ లేపేస్తున్నారు.

ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే.. ఒక ప్రక్కన సెప్టెంబర్ 23న వస్తున్న ''మజ్ఞూ'' సినిమా తాలూకు ప్రమోషన్లను యంగ్ హీరో నాని అదరగొడుతుంటే.. మరో ప్రక్కన మరో యంగ్ డైనమైట్ రామ్ మాత్రం ఇంతవరకు ''హైపర్'' తాలూకు సిగ్నల్స్ ఏమీ ఇవ్వనేలేదు. సెప్టెంబర్ 16న ఆడియో లాంచ్ అని గతంలో చెప్పారు కాని.. ఇంతవరకు ఆ హంగామా ఏమీ కనిపించకపోవడం పెద్ద విడ్డూరమే. అసలు సెప్టెంబర్ 30న సినిమా రిలీజ్ పెట్టుకుని.. ఇంత లేటుగా ఎవరైనా ప్రమోషన్లు స్టార్ట్ చేస్తారా?

పోనివ్ రామ్ కు భారీ ఓపెనింగులను తెచ్చేంత భారీ మార్కెట్ కూడా లేదాయే.. అలాంటప్పుడు హైప్ సృష్టించాలిగా. ఇక్కడ ఒక సందేహం వస్తోంది. అసలు హైపర్ సినిమా రిలీజవుతోందా లేకపోతే దసరా నాటికి ఏమన్నా వాయిదా పడుతోందా అని. చూద్దాం మరి మేకర్లు క్లారిటీ ఏమైనా ఇస్తారేమో!!