Begin typing your search above and press return to search.

కొత్త లుక్ కుర్రాడికి అచ్చొచ్చేనా!!

By:  Tupaki Desk   |   3 Oct 2017 8:25 AM GMT
కొత్త లుక్ కుర్రాడికి అచ్చొచ్చేనా!!
X
హిట్టు పడాలంటే లుక్కులను మాత్రమే నమ్ముకుంటే సరిపోదు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో చాలామంది స్టార్ హీరోలు సైతం లుక్స్ పరంగా ఎన్ని ప్రయోగాలు చేసినా కూడా.. కేవలం అక్కడ కంటెంట్ బాగుంటేనే సినిమాలు ఆడాయి. ఇక కంటెంట్ బాగున్నప్పుడు ఫ్లాపుల నుండి బయటపడి 'నేను శైలజ' అంటూ హిట్టు కొట్టిన రామ్.. మళ్ళీ మూస బాటలోకి వెళ్ళి 'హైపర్' అంటూ ఫ్లాపు తినేశాడు. అందుకే ఇప్పుడు మరోసారి రూటు మారుస్తున్నాడు.

మధ్యలో రెండు మూడు సినిమాలు అనుకోని వదిలేసి.. చివరకు కిషోర్ తిరుమల డైరక్షన్లో ''ఉన్నది ఒకటే జిందగీ'' సినిమాను ఓకే చేశాడు. ఆ దర్శకుడు కూడా వెంకీ తో ఒక సినిమాను అనుకొని అది ఆపేసి ఈ సినిమావైపు అడుగులు వేశాడు. కట్ చేస్తే ఈ సినిమా కోసం రామ్ కొత్త తరహాలో గెడ్డం పెంచుకుని.. అలాగే హెయిర్ స్టయిల్ మార్చి.. కొత్త ఫిజక్ తయారు చేసుకొని రంగంలోకి దిగాడు. లుక్ వైజ్ చాలా కొత్తగానే ఉంది కాని.. కంటెంట్ ఎలా ఉండబోతుంది అనేదే ఇప్పుడు అందరి ఆతృత. ఎందుకంటే లుక్ ఎలా ఉన్నా కూడా కంటెంట్ బాగాలేకపోతే మాత్రం ఆడియన్స్ డైరక్టుగా సినిమాను రిజక్ట్ చేస్తున్నారు.

చిన్నప్పట్నుంచి హ్యాపీగా వెళ్తోన్న అభిరామ్‌ అనే కుర్రాడి లైఫ్‌ లోకి ఇద్దరమ్మాయిలు వస్తారట. అందులో ఒకరు అనుపమా పరమేశ్వరన్ అయితే మరొకరు లావణ్య త్రిపాఠి. ముందుగా మేఘా ఆకాష్‌ చేయాల్సిన పాత్రలో.. ఇప్పుడు లావణ్య చేస్తోంది. ఈ ముగ్గురి ట్రయాంగిల్ కథే ఈ సినిమా.. అక్టోబర్ 27న సినిమా రిలీజ్. మరి బాక్సాఫీస్ ఈసారి రామ్ కోసం ఎలాంటి స్కెచ్ వేస్తోందో తెలియాలంటే.. అప్పటివరకు ఆగాల్సిందే.