Begin typing your search above and press return to search.

క్రిమిన‌ల్ లాయ‌ర్ ఇంత సెక్సీగానా?

By:  Tupaki Desk   |   10 March 2020 10:20 AM GMT
క్రిమిన‌ల్ లాయ‌ర్ ఇంత సెక్సీగానా?
X
మాస్ మ‌హారాజా ర‌వితేజ స‌ర‌స‌న నేల టిక్కెట్ చిత్రంలో న‌టించింది మాళ‌వికా శ‌ర్మ‌. ఆ సినిమా ఫ‌లితం తెలిసిందే. అటుపై రామ్ స‌ర‌స‌న రెడ్ చిత్రానికి ఎంపికైంది. కిషోర్ తిరుమల ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండ‌గా స్ర‌వంతి ర‌వికిషోర్ నిర్మిస్తున్నారు. ఇక సినిమాల్లోకి రాక‌పోతే మాళ‌విక ఏమ‌వుతుందో తెలుసా? ప‌క్కాగా క్రిమిన‌ల్ లాయ‌ర్ అవుతుంద‌ట‌.

ఇప్ప‌టికే న్యాయ‌విద్య‌లో ప‌ట్టా పుచ్చుకున్న ఈ అమ్మ‌డు పై చ‌దువులు చ‌దువుతోంది. ఇప్పుడు ఏకంగా హైదరాబాద్ కి చెందిన ప్ర‌ముఖ‌ క్రిమినల్ లాయర్ ప‌ట్టాభి వ‌ద్ద‌ ఇంటర్న్ షిప్ చేస్తోంది. క్రిమినల్ లాయర్ వి పట్టాభి వ‌ద్ద చేర‌మ‌ని ఎవ‌రో రిఫర్ చేసార‌ట‌. ఇక ఓవైపు రెడ్ చిత్రీక‌ర‌ణ‌లో పాల్గొంటూనే షెడ్యూల్ అనుమతించినప్పుడల్లా కోర్టు మెట్లు ఎక్కుతోంద‌ట‌. ఇంటర్న్‌షిప్ తనకు ఎలా సహాయపడిందనే దానిపైనా మాళ‌విక స్పందించింది.

ఏదైనా కేసును వాస్త‌విక ధృక్ప‌థంతో చూడ‌టం.. వాస్తవాలను సేకరించి విశ్లేషించడం.. ప్ర‌తిదీ అర్థం చేసుకోవడం .. దానిపై తార్కిక ఆలోచనను పెంపొందించుకోవ‌డం ఇదంతా బావుంది. ఈ ప్రాసెస్ నా ఆలోచ‌నా శ‌క్తిని విస్తృతం చేసింది.. అంటూ ఆనందం వ్య‌క్తం చేస్తోంది. త్వరలోనే న్యాయ‌ శాస్త్రంలో మాస్టర్స్ పూర్తి చేయాల‌నుకుంటోంద‌ట‌. అందుకు దరఖాస్తు చేసుకోవాలని యోచిస్తోంది. ఇక మాళ‌విక‌ తో పాటు రెడ్ చిత్రం లో నివేదా పెతురాజ్ - అమృత అయ్యర్ నటిస్తున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ లో సినిమా విడుదల కానుంది. అన్న‌ట్టు స‌హ‌నాయిక‌లు ఇలాంటి క్రిమిన‌ల్ లాయ‌ర్ ని త‌ట్టుకోవ‌డం అంత సులువేమీ కాదేమో!!