Begin typing your search above and press return to search.

వెబ్ సిరీస్ గా సెవెంత్ సెన్స్ 'బోధిధర్మ'

By:  Tupaki Desk   |   16 Jan 2017 5:11 AM GMT
వెబ్ సిరీస్ గా సెవెంత్ సెన్స్ బోధిధర్మ
X
కోలీవుడ్ హీరో సూర్య నటించిన సెవెంత్ సెన్స్ మూవీలో బోధిధర్మ పాత్ర గుర్తుందా? ఇండియా నుంచి చైనా వెళ్లి అక్కడి వాళ్లకు మార్షల్ ఆర్ట్స్ సహా అన్నీ నేర్పించి.. ఇప్పటి కుంగ్ ఫూ లాంటి విద్యలకు ఆద్యుడుగా బోధిధర్ముడిని చెబుతారు. ఇప్పుడా పాత్రతో ఓ వెబ్ సిరీస్ చేయడానికి సిద్ధమయ్యాడు "నీర్జా" దర్శకుడు రామ్ మాధ్వాని.

'బోధిధర్ముడి గురించి ఎక్కువగా ఎవరికి తెలియదు. ఆయన ఓ తత్వవేత్త.. వైద్యుడు.. మార్షల్ ఆర్ట్స్ వంటి విద్యలు అన్నిటితో.. చైనాలో దేవుడిగా కీర్తించబడ్డాడు. నేటివ్ గా తమిళుడు అయిన ఈయనను చైనీయులు మొదట అనుమానించారు. ఆ తర్వాత వారి తన మంచితనం.. తెలివితేటలు..కళలతో వారి మనుసులు గెలుచుకున్నాడు. అందుకే బోధిధర్మడు అక్కడ నుంచి వెళ్లిపోవడానికి కూడా వారు ఇష్టపడలేదు' అని చెబుతున్నాడు దర్శకుడు రామ్ మాధ్వాని. ఈ స్టోరీని వెబ్ సిరీస్ గా మలచబోతున్నట్లు అనౌన్స్ చేశాడు.

'ఈ వెబ్ సిరీస్ లో అందరినీ కొత్తవారిని తీసుకోబోతున్నాం. పాతవారితో తీస్తే.. ఆడియన్స్ కు ముందు నుంచే ఇతర అంచనాలు ఏర్పడతాయి' అన్న రామ్ మాధ్వాని.. ఇఫ్పటివరకూ తాను సినిమాలతో పాటు యాడ్స్ చేశానని.. ఇప్పుడు కొత్త ఫార్మాట్ లోకి అడుగుపెడుతున్నానని అంటున్నాడు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/