Begin typing your search above and press return to search.

రామ్‌ లింగుస్వామి మూవీ షూటింగ్‌ అప్‌డేట్‌

By:  Tupaki Desk   |   20 Aug 2021 4:20 AM GMT
రామ్‌ లింగుస్వామి మూవీ షూటింగ్‌ అప్‌డేట్‌
X
ఎనర్జిటిక్ స్టార్ రామ్‌ పోతినేని ప్రస్తుతం తమిళ స్టార్‌ డైరెక్టర్ లింగు స్వామి దర్శకత్వంలో చేస్తున్న విషయం తెల్సిందే. రామ్‌ గత సినిమా అనుభవం దృష్ట్యా కాస్త గ్యాప్‌ తీసుకుని చాలా కథలు విని చివరకు అద్బుతమైన మాస్ యాక్షన్ కథకు ఓకే చెప్పాడు. లింగు స్వామి గతంలో తెలుగు లో పలువురు స్టార్‌ హీరోలతో సినిమాలు చేసే అవకాశం దక్కినా కూడా కొన్ని కారణాల వల్ల అవి పట్టాలెక్కలేదు. ఇప్పుడు ఆయన దర్శకత్వంలో రామ్‌ చేస్తున్న మూవీ మాస్ తో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటుంది అంటూ యూనిట్‌ సభ్యులు నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.

ఈ సినిమా ప్రకటించినప్పటి నుండి ప్రేక్షకులు మరియు అభిమానులు ఎప్పుడెప్పుడు ఈ సినిమా వస్తుందా అంటూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రతి సన్నివేశం కూడా రామ్‌ ఇమేజ్‌ ను పెంచే విధంగా ఉంటుందని.. రామ్ ఈ సినిమా లో చాలా స్టైలిష్‌ లుక్ లో కూడా కనిపించబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. మొత్తానికి ఈ సినిమా చాలా స్పెషల్‌ గా ఉంటుందనే నమ్మకంను వారు వ్యక్తం చేస్తున్నారు. గత నెలలో మొదలు అయిన మొదటి షెడ్యూల్‌ షూటింగ్‌ తో సినిమాకు సంబంధించిన కీలక సన్నివేశాలు మరియు యాక్షన్‌ సన్నివేశాల చిత్రీకరణ జరిపినట్లుగా తెలుస్తోంది.

ఇటీవలే మొదటి షెడ్యూల్‌ ను ముగించారు. హైదరాబాద్ మరియు చెన్నైలో మొదటి షెడ్యూల్‌ ను నిర్వహించారు. సినిమా కు సంబంధించిన మేజర్ పార్ట్‌ చిత్రీకరణ ముగించిన దర్శకుడు లింగు స్వామి త్వరలో తదుపరి షెడ్యూల్‌ ను మొదలు పెట్టేందుకు గాను ఏర్పాట్లు చేస్తున్నారు. సెకండ్‌ షెడ్యూల్‌ లో పాటల చిత్రీకరణ తో పాటు ఇతర ముఖ్య సన్నివేశాలను చిత్రీకరించబోతున్నారు. రాబోయే రెండు మూడు నెలల్లో సినిమాను ముగించేలా ప్లాన్‌ చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. ఈ సినిమా ఖచ్చితంగా రామ్‌ ఎనర్జిని చూపించే పవర్‌ హౌస్‌ మాదిరిగా ఉండి కమర్షియల్‌ గా బిగ్‌ సక్సెస్ ను దక్కించుకుంటుంది అంటూ అభిమానులు నమ్మకంతో ఉన్నారు. ఇక ఈ సినిమా లో రామ్‌ కు జోడీగా ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. రామ్‌ తో ఈ సినిమాలో మరో ముద్దుగుమ్మ కూడా నటిస్తున్న విషయం తెల్సిందే. ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ ను వచ్చే నెలలో వినాయక చవితి సందర్బంగా విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.