Begin typing your search above and press return to search.

అటు అందాల నిధి.. ఇటు సోయగాల నభ!

By:  Tupaki Desk   |   7 Jun 2019 1:35 PM IST
అటు అందాల నిధి.. ఇటు సోయగాల నభ!
X
ఒక్క అందాన్నే తట్టుకోవడం సాధారణ జనాలకు కష్టం. కానీ ఇస్మార్ట్ శంకర్ మాత్రం రెండు అందాలను అటూ ఇటూ పెట్టుకొని తాపీగా పోజిచ్చాడు. కారణం సింపుల్.. ఎందుకంటే ఆయనకు డబల్ దిమాక్.. ఒక అందానికి ఒకటి.. మరో అందానికి మరొకటి. అందుకే ఆ అందాలను తట్టుకోగాలుగుతున్నాడు. అయినా..

ఈ డబల్ దిమాక్ సారుకు దిమాక్ ఖరాబ్ అయిందట. మన పిచ్చి కానీ ఎంత డబల్ దిమాక్ ఉన్నా అందాలతో దిమాక్ ఖరాబ్ కాని షరీఫ్ ఇన్సాన్ ఎవరైనా ఉన్నారా? మరి శంకర్ గారి దిమాక్ ఖరాబ్ కావడానికి కారణం ఏంటో మనకు తెలియదు కానీ తాజాగా 'ఇస్మార్ట్ శంకర్' నుండి 'దిమాక్ ఖారాబ్' అనే లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేస్తున్నారట. తెలంగాణా యాసలో మాంచి తీన్ మార్ ఊపులో ఈ పాటను సంగీత ప్రియులకు పిచ్చెక్కించేలా వండి వార్చారట. ఆ పాటకు శాంపిల్ అన్నట్టుగా ఒక పోస్టర్ ను వదిలారు. రామ్ మంచి డ్యాన్సర్ అనే సంగతి తెలిసిందే. ఇక అటు ఇటూ నిధి.. నభా ఉంటే డబల్ జోష్ లో డ్యాన్స్ వేస్తాడేమో. పోస్టర్లో హీరోయిన్లు ఇద్దరూ ఒకేరకమైన ఛోళీ..లెహెంగా వేసుకొని అందాలను ధారపోస్తూ నిలబడ్డారు. రామ్ కు పోటీగా వారు కూడా తీన్ మార్ స్టెప్పులు వేయక తప్పేలా లేదు.

ఈ సినిమాకు సంగీత దర్శకుడు మణిశర్మ అనే సంగతి తెలిసిందే. ఈ పాటకు సాహిత్యం అందించిన వారు కాసర్ల శ్యామ్. ఇస్మార్ట్ శంకర్ సినిమానుండి రిలీజ్ కానున్న ఫస్ట్ సింగిల్ ఇది. ఈరోజు సాయంత్రం 5 గంటలకు ఈ పాటను విడుదల చేస్తారమని దర్శకుడు పూరి జగన్నాధ్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా ప్రకటించారు.