Begin typing your search above and press return to search.

సూప‌ర్ స్టార్స్ కంటే కుల‌పిచ్చి ముఖ్యం

By:  Tupaki Desk   |   9 Aug 2019 7:31 PM IST
సూప‌ర్ స్టార్స్ కంటే కుల‌పిచ్చి ముఖ్యం
X
ఆర్జీవీ ఏం చేసినా వివాదం వెంట ఉండాల్సిందే. ఇటీవ‌ల ఆయ‌న చేస్తున్న‌ రాద్ధాంతం మామూలుగా లేదు. అయిన దానికి కానిదానికి ప్ర‌చారం కోరుకుంటూ వ‌ర్మ గారి రచ్చ ప్ర‌ముఖంగా చ‌ర్చల్లోకొస్తోంది. ఇస్మార్ట్ శంక‌ర్ చిత్రంతో శిష్యుడు పూరి బ్లాక్ బ‌స్ట‌ర్ కొట్టినందుకు పార్టీ పేరుతో బీర్ లో స్నానం చేసిన ఆర్జీవీ.. క‌థానాయిక‌ల‌పైనా బీర్ చిమ్మి నానా ర‌చ్చ చేశారు.

ఆ ఇన్సిడెంట్ మ‌ర్చిపోయారు అనుకుంటుండ‌గానే ఈలోగానే మ‌రో కొత్త ర‌చ్చ‌కు తెర తీశారు. ఈసారి `క‌మ్మ రాజ్యంలో క‌డ‌ప రెడ్లు` అంటూ తాను తీయ‌బోయే సినిమా గురించి ర‌చ్చ మొద‌లు పెట్టారు. నేటి ఉద‌యం ఆయ‌న రిలీజ్ చేసిన లిరిక‌ల్ వీడియో సామాజిక మాధ్య‌మాల్లోకి దూసుకెళ్లింది. ఇందులో కుల రాజ‌కీయాల్ని ట‌చ్ చేస్తున్నార‌ని అర్థ‌మ‌వుతోంది. సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి.. ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు చంద్ర‌బాబు నాయుడు.. జ‌న‌సేన ప‌వ‌న్ క‌ల్యాణ్ స‌హా ప‌లువురిని పావులుగా ఉప‌యోగించుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నారు వ‌ర్మ‌. అంతేనా తాను రిలీజ్ చేసిన లిరిక‌ల్ వీడియో నేడు గూగుల్ ట్రెండ్స్ లో నంబ‌ర్ వ‌న్ పొజిష‌న్ లో ఉంద‌ని ఆయ‌న‌కు ఆయ‌నే డ‌ప్పు వేసుకుంటున్నారు.

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బ‌ర్త్ డే సంద‌ర్భంగా రిలీజ్ చేసిన `స‌రిలేరు నీకెవ్వ‌రు` ఇంట్రో కంటే `క‌మ్మ రాజ్యంలో క‌డ‌ప రెడ్లు` లిరిక్ బెట‌ర్ ట్రెండింగ్ లో ఉంద‌ని వ‌ర్మ సామాజిక మాధ్య‌మాల్లో చెప్పుకున్నారు. నంబ‌ర్ 2లో మేమే ఉన్నాం. ఆ త‌ర్వాతే ఎవ‌రైనా అంటూ క‌ల‌రింగ్ ఇచ్చారు. ఒకేసారి రెండూ రిలీజ‌య్యాయి. కానీ మా లిరిక్ కే ఆద‌ర‌ణ ఎక్కువ‌గా ఉంది. జ‌నాల‌కు సూప‌ర్ స్టార్ కంటే కులం ఫీలింగే ముఖ్యం.. వెరీ బ్యాడ్!! అంటూ వ్యాఖ్యానించారు. మొత్తానికి వ‌ర్మ మార్క్ ప్ర‌చారార్భాటం అలా షురూ అయ్యింది. అయితే ఈ ఆర్భాటానికి త‌గ్గ‌ట్టే సినిమాలో కంటెంట్ లేక‌పోతే మాత్రం జ‌నం య‌థావిధిగా `ల‌క్ష్మీస్ ఎన్టీఆర్` రిజ‌ల్టునే క‌ట్ట‌బెడ‌తారేమో! త‌స్మాత్ జాగ్ర‌త్త ఆర్జీవీ!!