Begin typing your search above and press return to search.

టీచ‌ర్స్ డేపై వ‌ర్మ బాంబు...వాళ్లు ఫెయిల్ అంటూ ట్వీట్‌

By:  Tupaki Desk   |   5 Sep 2019 10:18 AM GMT
టీచ‌ర్స్ డేపై వ‌ర్మ బాంబు...వాళ్లు ఫెయిల్ అంటూ ట్వీట్‌
X
సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రాంగోపాల్ వ‌ర్మ మ‌రోసారి సంచ‌న‌ల ట్వీట్‌ తో వార్త‌ల్లోకెక్కాడు. గ‌తంలో వినాయ‌క చ‌వితి సంద‌ర్భంగా వినాయ‌కుడి తొండంపై కామెంట్ చేసి వివాస్ప‌దంగా మారిన వ‌ర్మ తాజాగా టీచ‌ర్స్ డే సంద‌ర్భంగా చేసిన ట్వీట్ మ‌రోసారి వివాస్ప‌ద‌మైంది. టీచ‌ర్స్ డే సంద‌ర్భంగా వ‌ర్మ చేసిన ట్వీట్లు ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవ్వ‌డంతో పాటు హాట్ టాపిక్‌గా మారాయి.

టీచ‌ర్స్ డే సంద‌ర్భంగా వ‌ర్మ వ‌రుస‌గా ట్వీట్లు చేసుకుంటూ పోయాడు. ముఖ్యంగా ‘టీచర్స్ డే రోజు టీచర్లు.. టీచర్స్ విస్కీ తాగి సెలబ్రేట్ చేసుకుంటారా.. జస్ట్ ఆస్కింగ్' అంటూ చేసిన ట్వీట్ వివాదాస్పదం అవుతోంది. అక్క‌డితో ఆగ‌ని వ‌ర్మ ఈ ట్వీట్‌ కు టీచ‌ర్స్‌ - విస్కీ బాటిల్‌ తో పాటు త‌న ఫొటో కూడా యాడ్ చేశాడు.

ఇక మ‌రో పోస్ట్‌లో త‌న‌ను మంచి విద్యార్థిగా తీర్చిదిద్ద‌లేదంటూ త‌న‌కు విద్య నేర్పిన టీచ‌ర్ల‌పై అక్క‌సు వెళ్ల‌గ‌క్కాడు. ‘నన్ను మంచి విద్యార్థిగా - మానవతావాదిగా తీర్చిదిద్దడంలో నా టీచర్లు అందరూ ఫెయిల్ అయ్యారు. అందువల్ల నాకు టీచర్స్ డే అంటే ఏంటో తెలియదు ' అంటూ పేర్కొన్నాడు.

ఇక చివ‌రి ట్వీట్లో ‘నేను ఒక బ్యాడ్ స్టూడెంట్‌ ను. నన్ను మంచిగా చేయలేకపోయిన టీచర్స్ కూడా గుడ్ కాదు ' అని పేర్కొన్నాడు. వ‌ర్మ చేసిన ట్వీట్ల‌తో మ‌రోసారి నెటిజ‌న్లు వ‌ర్మ‌ను టార్గెట్‌ గా చేసుకుని విమ‌ర్శ‌లు చేస్తున్నారు. నీ లాంటి బ్యాడ్ స్టూడెంట్‌ ను బాగు చేయ‌డం ఎంత మంచి టీచ‌ర్‌ కు అయినా సాధ్యం కాద‌ని కౌంట‌ర్లు వేస్తున్నారు.