Begin typing your search above and press return to search.

వ‌ర్మ ట్వీటు త‌ప్పాడు

By:  Tupaki Desk   |   19 April 2016 4:05 AM GMT
వ‌ర్మ ట్వీటు త‌ప్పాడు
X
మాట త‌ప్ప‌డం వ‌ర్మ‌కి అల‌వాటే. అస‌లు మాట‌మీద నిల‌బ‌డే అల‌వాటే నాకు లేద‌ని చెబుతుంటాడు. ఇప్పుడు మాట‌తో పాటు ట్వీటు కూడా త‌ప్పాడు. అభిమానులంద‌రూ న‌న్ను త‌ప్పుగా అర్థం చేసుకుంటున్నారు కాబ‌ట్టి ఇక ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్‌ క‌ళ్యాణ్ గురించి ట్వీట‌నంటే ట్వీట‌న‌ని రామ్ గోపాల్ వ‌ర్మ కొన్ని రోజుల‌క్రిత‌మే ట్విట్ట‌ర్‌ లో ఓ పోస్ట్ పెట్టాడు. ఆ త‌ర్వాత రెండు మూడు రోజుల‌పాటు ప‌వ‌ర్‌ స్టార్ ప‌వ‌న్‌ క‌ళ్యాణ్ అనే పేరును ప్ర‌స్తావించ‌కుండా ఇండైరెక్టుగా ప‌వ‌ర్ అనే మాట‌ని మాత్ర‌మే వాడుతూ సెట్టైర్లు వేశాడు. అంత‌కుమించి ప‌వ‌న్‌ క‌ళ్యాణ్ పేరును మాత్రం వాడ‌డు కామోసు అనుకున్నారంతా. కానీ నిన్న రాత్రి నుంచి మ‌ళ్లీ ట్విట్ట‌ర్‌ లో ప‌వ‌ర్‌ స్టార్ జ‌పం మొద‌లుపెట్టాడు వ‌ర్మ‌. ఈసారి ర‌జ‌నీకాంత్ ఫ్యాన్స్ తీరుని ప్ర‌స్తావిస్తూ ప‌వ‌ర్‌ స్టార్ ఫ్యాన్స్ ద‌గ్గ‌రికి వ‌చ్చాడు.

ప‌వ‌ర్‌ స్టార్ గురించి మాట్లాడ‌న‌ని ఎప్పుడైతే ట్వీటాడు ఆ వెంట‌నే వ‌ర్మ క‌న్ను ర‌జ‌నీకాంత్‌ పై ప‌డింది. అమీజాక్స‌న్‌ తో క‌లిసి వున్న ర‌జ‌నీకాంత్ ఫొటోని ట్విట్ట‌ర్‌ లో పోస్ట్ చేస్తూ రెండు రోజుల‌పాటు ర‌క‌ర‌కాల వ్యాఖ్య‌లు చేశాడు వ‌ర్మ‌. ఆ ట్వీట్లు చూసిన ర‌జ‌నీ ఫ్యాన్స్‌ కి చిర్రెత్తుకొచ్చింది. ట్విట్ట‌ర్‌ నే వేదికగా చేసుకొని వ‌ర్మ‌పై ఎదురుదాడికి దిగారు. అస‌లు వ‌ర్మ కోరుకొనేదే ఇది క‌దా! అందుకే వ‌ర్మ కూడా మ‌రింత‌గా రెచ్చిపోయాడు. నా ట్వీట్ట‌ని అర్థం చేసుకోవ‌డంలో రజ‌నీకాంత్ ఫ్యాన్స్ కూడా ప‌వ‌ర్‌ స్టార్ ఫ్యాన్స్‌ లాగే వెనక‌బ‌డిపోయార‌ని ట్వీటాడు వ‌ర్మ‌. ``మూగ ర‌జ‌నీ ఫ్యాన్స్ అంతా ఒక్క విష‌యం అర్థం చేసుకోవాలి, నా హిట్టు సినిమాల‌కంటే ర‌జ‌నీకాంత్ ఫ్లాప్ సినిమాల్నే నేను ఎక్కువ‌గా చూశా. న‌న్ను అన‌వ‌స‌రంగా తిట్ట‌కండి`` అని ట్వీటు పెట్టాడు వ‌ర్మ‌. ఇలా స్టార్ క‌థానాయ‌కులంద‌రినీ ఏదో ర‌కంగా కామెంట్ చేస్తూ ఎప్పుడూ జ‌నాల నోళ్ల‌ల్లో నాన‌డం వ‌ర్మ‌కి ఓ హాబీ.