Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్ నన్నిలా చేశాడు: రామ్ గోపాల్ వర్మ

By:  Tupaki Desk   |   19 Oct 2018 12:21 PM IST
ఎన్టీఆర్ నన్నిలా చేశాడు: రామ్ గోపాల్ వర్మ
X
ఆస్తికులంటే ఎవరు? దేవుడ్ని నమ్మేవారు. నాస్తికులంటే ఎవరు? దీనికి అన్సర్ చెప్పడం కాస్త కష్టం. వాళ్ళు రెండు రకాలు ఒక రకం వారు మతం మతం.. దేవుడు కంటే మానవత్వం మిన్న. మానవత్వం ముఖ్యం కానీ దేవుడూ దెయ్యం కాదు అంటారు. ఈ వర్గం పాజిటివ్. వాళ్ళ పనేదో వాళ్ళు చూసుకుంటారు కానీ ఆస్తికులను కెలకరు. రెండో రెండో వర్గం వారు దేవుడిని నమ్మరు.. నమ్మకపోతే ఊరుకోవచ్చుగా.. దేవుళ్ళని తిడుతూ ఆస్తికులను ఆడిపోసుకుంటూ 'మీరు గొర్రెలురా' అని ప్రూవ్ చేయడానికి ఎప్పుడూ రెడీ గా ఉంటారు.

మరి రామ్ గోపాల్ వర్మ వీటిలో ఏ కేటగిరీలో ఉంటాడో తెలీదుగానీ తనను తాను నాస్తికుడిగా చెప్పుకుంటాడు. కానీ ఈమధ్య తిరుపతికెళ్ళి దర్శనం చేసుకుంటానని ఆ తర్వాత తన తాజా చిత్రం 'లక్షీస్ ఎన్టీఆర్' సినిమా వివరాలను ఒక ప్రెస్ మీట్ లో ప్రకటిస్తానని తెలిపాడు. అన్నట్టే తిరుమల వెళ్లి శ్రీవారిని దర్శనం చేసుకున్నాడు. అసలు సిసలైన భక్తుడి అవతారంలో తెల్ల చొక్కా.. ఎర్ర కండువా.. నుదుటన కుంకుమ బొట్టు.. చేతుల్లో వెంకటేశ్వర స్వామి ప్రసాదం అయిన పెద్ద లడ్డూతో ఒక ఫోటో కు పోజిచ్చాడు.

ఈ ఫొటోను సోషల్ మీడియా లో పోస్ట్ చేసి ఇలా క్యాప్షన్ పెట్టాడు.. "ఎన్టీఆర్ నన్ను 'లక్ష్మిస్ ఎన్టీఆర్ కోసం' ఇలా చేశాడు". ఇందులో అర్థం పరమార్థం ఏంటో వర్మ సారే చెప్పాలి. నాస్తికుడంటాడు.. భక్తుడి గెటప్ లో ఉన్నాడు.. సరే భక్తుడని ఒప్పుకుంటాడా అంటే 'పెద్దాయన' ఎన్టీఆర్ నన్నిలా చేశాడంటాడు. ఏంటో ఈ విపరీతం.. ఏడూ కొండలవాడా వెంకట రమణా గోవిందా గోవిందా.. ఈ అమాయకలైన తెలుగు జనాలకు ఈయన్ని.. ఈయన భక్త వర్మప్ప గెటప్పును అర్థం చేసుకునే తెలివితేటలు ప్రసాదించు తండ్రీ..!