Begin typing your search above and press return to search.

పుష్కరాలని వాడుకుంటున్న రామూ

By:  Tupaki Desk   |   11 Aug 2016 5:00 AM GMT
పుష్కరాలని వాడుకుంటున్న రామూ
X
కృష్ణా పుష్కరాల శోభతో విజయవాడ వెయ్యి రేట్లు ఎక్కువగా వెలిగిపోతుంది. విభజన తరువాతి వేడుక కావడంతో తామేంటో చూపించడానికి ఆ ప్రాంత వాసులు ఉవ్విళ్ళూరుతున్నారు. ఈ పన్నెండు రోజులూ విజయవాడంతా భక్తులు, యాత్రికులతో కిక్కిరిసిపోతుంది.

అయితే ఈ విషయాన్ని కూడా క్యాష్ పాయింట్ గా మార్చుకోవడంలోనే ఫిలిం మేకర్ రామ్ గోపాల్ వర్మ తెలివితేటలు దాగున్నాయి. తెలుగులో తన చివరి చిత్రమని ప్రకటించిన వంగవీటి సినిమా షూటింగ్ కోసం ఈ పుష్కరాలను వాడుకోనున్నట్టు తెలుస్తుంది.

గెరిల్లా షూటింగ్ ప్రక్రియ ద్వారా షూటింగ్ జరుగుతున్న విషయం తెలియకుండానే తనకి కావలసిన పార్ట్ ని షూట్ చేసుకుంటూ చక్కాపోతాడట రామూ. ఇప్పటికే సగానికి పైగా పూర్తయిన ఈ సినిమా ఈ ఏడాదిలోనే వుంటుందని సమాచారం.