Begin typing your search above and press return to search.

వర్మ మాటలకు అర్థాలే వేరులే

By:  Tupaki Desk   |   20 Jan 2018 4:13 AM GMT
వర్మ మాటలకు అర్థాలే వేరులే
X
ఎవరికి అర్థం కాని పుస్తకం వర్మ అని ఊరికే అనలేదు అభిమానులు. తన మాటలు , చేష్టలు, సినిమాలు, వెబ్ సిరీస్ ద్వారా నిత్యం ఏదో ఒకరకంగా వార్తల్లో ఉండే రామ్ గోపాల్ వర్మ గతంలోలా కాకుండా ఈ మధ్య పవన్ కళ్యాణ్ మీద విమర్శల దూకుడు తగ్గించిన సంగతి తెలిసిందే. కొంత కాలం క్రితం పవన్ కళ్యాణ్ మాత్రమే కాదు ఇంకే మెగా హీరో జోలికి వెళ్ళను అని ట్విట్టర్ నుంచి నిష్క్రమించిన అతి తక్కువ టైంలోనే మళ్ళి వెనక్కు వచ్చిన వర్మ పవన్ మీద ఎటాక్ స్టార్ట్ చేసేసాడు. ఈ సారి టాపిక్ గురించి పెద్దగా కష్టపడాల్సిన అవసరం రాలేదు లేండి. సంక్రాంతికి విడుదలై డిజాస్టర్ టాక్ తెచ్చుకున్న అజ్ఞాతవాసిని టార్గెట్ చేసాడు. ఊరికే బాలేదు - పవన్ సరిగా చేయలేదు అని మామూలుగా అంటే అతను వర్మ ఎందుకు అవుతాడు. అందుకే తనదైన శైలిలో ట్వీటాడు. అవేంటో చూడండి.

ఒక మెసేజ్ లో అందరు అజ్ఞాతవాసి ఫెయిల్యూర్ కి త్రివిక్రమ్ ని నిందించడం కరెక్ట్ కాదని, ఆకాశమంత ఇమేజ్ ఉన్న పవన్ కళ్యాణ్ మీద దుప్పటి కప్పడం హాలీవుడ్ ప్రఖ్యాత దర్శకుడు జురాసిక్ పార్క్ లాంటి క్లాసిక్స్ తీసిన స్టీవెన్ స్పిల్బర్గ్, అవతార్ దర్శకుడు జేమ్స్ క్యామరున్ వల్ల కూడా కాదట. ఇదే కౌంటర్ అనుకుంటే మరో పంచ్ కూడా ఇచ్చాడు వర్మ. అమ్మ తోడు అంటూ పైన చెప్పిన ఇద్దరితో పాటు క్రిస్టోఫర్ నోలన్, స్వర్గీయ అల్ఫ్రెడ్ హిచ్ కాక్ కలిసి ఫ్రాన్సిస్ కొప్పల, అకిరా కురసోవాలను అసిస్టెంట్ డైరెక్టర్లు గా పెట్టుకుని సినిమా తీసినా పవర్ ఇమేజ్ కి న్యాయం చేయలేరని అలాంటప్పుడు త్రివిక్రమ్ ని నిందించడం కరెక్ట్ కాదని అనేసాడు.

ఇక్కడ పవన్ ఇమేజ్ ని పోగిడాడో లేక కౌంటర్ వేసాడో కొందరు అభిమానులకు అర్థం కాకపోయినా నిశితంగా గమనిస్తే ప్రపంచ ప్రసిద్ధి చెందిన దర్శకులు సైతం పవన్ ను డీల్ చేయలేరు అని చెప్పడం వ్యంగ్యంగానే అర్థాన్ని ఇస్తుంది. వరల్డ్ సినిమాలో తమ పేరుని మొదటి పేజీల్లో రాసుకున్న గొప్ప దర్శకులే పవన్ ఇమేజ్ ని మోయలేరు అనటం ఒకరకంగా ఎగతాళిగానే తీసుకోవాలి. ఇదే త్రివిక్రమ్ అత్తారింటికి దారేదితో బ్లాక్ బస్టర్ ఇచ్చాడు, రెండు సినిమాల అనుభవం ఉన్న హరీష్ శంకర్ గబ్బర్ సింగ్ లాంటి ఇండస్ట్రీ హిట్ ఇచ్చాడు అనే విషయాలు ఇక్కడ ప్రస్తావనకు రావు లేండి. ఎందుకంటే వర్మ రూటే సెపరేటు.