Begin typing your search above and press return to search.

ప్ర‌కాష్ రాజ్ నాన్ లోక‌ల్ అయితే అమితాబ్ -ర‌జ‌నీ లోక‌లా!- ఆర్జీవీ

By:  Tupaki Desk   |   26 Jun 2021 3:00 PM IST
ప్ర‌కాష్ రాజ్ నాన్ లోక‌ల్ అయితే అమితాబ్ -ర‌జ‌నీ లోక‌లా!- ఆర్జీవీ
X
``లోక‌ల్- నాన్ లోక‌ల్`` అంటూ మా అసోసియేష‌న్ ఎన్నిక‌ల్లో డిబేట్ చూస్తున్న‌దే. ప్ర‌కాష్ రాజ్ నాన్ లోక‌ల్ అంటూ ప్ర‌త్య‌ర్థి వ‌ర్గం ప్ర‌చారం చేయ‌డంతో అది కాస్తా మీడియా హెడ్ లైన్స్ లోకి వ‌చ్చింది. అయితే దానికి సీనియ‌ర్ న‌రేష్ మీడియా ముఖంగా వివ‌ర‌ణ ఇచ్చారు. తాము అలా ప్ర‌చారం చేయ‌లేద‌ని మా ఎన్నిక‌ల్లో స‌భ్యుడు ఎవ‌రైనా పోటీచేయొచ్చ‌ని అన్నారు.

ఇక‌పోతే ప్ర‌కాష్ రాజ్ నాన్ లోక‌ల్ అయితే అమితాబ్.. ర‌జ‌నీ అక్క‌డ లోక‌లా? అంటూ ప్ర‌శ్నిస్తూ ఆర్జీవీ డిబేట్ ని హీటెక్కించారు.

కర్ణాటక నించి ఏపీకి వచ్చిన ప్రకాశ్‌రాజ్‌ నాన్‌ లోకల్‌ అయితే, .. మహారాష్ట్ర నుండి ఎక్కడెక్కడికో వెళ్ళిన రజనీకాంత్... ఉత్తర ప్రదేశ్ నుంచి మహారాష్ట్ర కి వెళ్ళిపోయిన అమితాబ్ బచ్చన్ లోకలా అంటూ తనదైన స్టైల్ లో పంచుల వర్షం కురిపించారు.

ముప్పై ఏళ్లుగా ఇక్కడే ఉండి తెలుగు నేర్చుకొని చలం పుస్తకాలని మళ్ళీ తనే ముద్రించి పెళ్ళాం పిల్లలతో ఇక్కడే ఉంటూ తెలంగాణ లో ఒక గ్రామాన్ని దత్తత తీసుకొని అక్కడున్న ఎంతో మంది ఆడవాళ్ళకి పని కల్పిస్తున్న ప్రకాశ్‌ రాజ్‌ నాన్‌ లోకలా? అని ప్రశ్నించారు. ప్రస్తుతం ప్రకాశ్ రాజ్ పై ఆర్జీవీ చేసిన ఈ ట్వీట్లు సోషల్‌ మీడియాలో వైరల్ గా మారాయి.

మీరందరూ ప్రేమించే హీరోయిన్స్ అందరూ నాన్ లోకల్ .. మైఖేల్ జాక్సన్ నాన్ లోకల్ .. బ్రూస్ లీ నాన్ లోక‌ల్.. రాముడు సీత కూడా నాన్ లోకల్ .. అంటూ ఆర్జీవీ వ‌రుస ట్వీట్ల‌తో అంత‌కంత‌కు హీట్ పెంచేసాడు.

దీనికి అభిమానుల నుంచి స్పంద‌న అనూహ్యంగా ఉంది. లోకల్ ఫీలింగ్ మనకంటే తమిళనాడులో ఎక్కువ...వాళ్ళే... సీఎంలు ఎక్కువ శాతం ...నాన్ లోకల్ వాళ్లని ఎన్నుకున్నారు.... తెలుగు వాడైన విశాల్ కోలీవుడ్ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ కి అధ్యక్షుడు అయ్యాడు.... అంత లోకల్ ఫీలింగ్ ఉంటే...అమెరికాలో భారతీయులు సత్య నాదెళ్ల ఉండడు... సుందర్ పిచాయ్ ఉండడు... అంటూ డిబేట్ ని పీక్స్ కి చేర్చారు. ప్ర‌స్తుతానికి సోష‌ల్ మీడియాల‌లో లోక‌ల్ నాన్ లోక‌ల్ టాపిక్ ట్రెండింగ్ గా మారింది. ఒక ర‌కంగా ప్ర‌కాష్ రాజ్ కి అంత‌కంత‌కు మ‌ద్ధ‌తు పెరుగుతోంద‌నే చెప్పాలి.