Begin typing your search above and press return to search.

అనుభ‌వించు రాజా.. ఏంటిది ఆర్జీవీ ఈ లైఫ్ మ‌జాక్!

By:  Tupaki Desk   |   22 Aug 2021 8:00 AM IST
అనుభ‌వించు రాజా.. ఏంటిది ఆర్జీవీ ఈ లైఫ్ మ‌జాక్!
X
అనుభవించు రాజా... ! పుట్టింది దేనికి.. గిట్టేది దేనికి? ఉన్నంత కాలం న‌చ్చిన‌ట్టు ఎంజాయ్ చేయ్.. దొరికిందేదో దోచుకో..! ఇదీ ఆర్జీవీ వ్య‌వ‌హార శైలి. గాళ్స్ తో ఆయ‌న చేసే ర‌చ్చ‌కు అంతూ ద‌రీ లేదు. బ‌ర్త్ డే పార్టీ.. వైన్ పార్టీ.. డిన్న‌ర్ పార్టీ .. మొత్తానికి పార్టీ ఏదైనా ఆయ‌న చేసే ర‌చ్చ మామూలుగా లేదు. ఇటీవ‌ల త‌న సినిమాల్లో న‌టించే క‌థానాయిక‌ల‌కు హ‌గ్గులు ముద్దుల‌తో బోలెడంత ప్ర‌చారం చేస్తున్నారు. టీజింగ్ టెంప్టింగ్ ఆయ‌న ప్ర‌చార శైలి.

వివాదాల‌తో ఆర్జీవీకి ఏ సంబంధం లేదు అన్న‌ట్టుగానే ఉంది వ్య‌వ‌హారం. ఏది చేసినా అది ఆర్జ‌న కోసం.. ఆస్వాధ‌న కోసం అన్న‌ట్టుగా ఉంది ఆయ‌న వాల‌కం. ఇక‌ సమాజంలో జరిగే ప్రతి అంశాన్ని అందరికంటే భిన్నంగా చూసే వర్మ తన తీరుతో ఎదుటివారిని ఇబ్బంది పెడుతూనే త‌న ప‌బ్బం గ‌డిపేస్తున్నారు. ఇప్ప‌టికే ప‌లువురు బుల్లితెర యూట్యూబ్ యాంక‌ర్ల‌తో ఆర్జీవీ ప‌రాచికాలు సంచ‌ల‌నాలుగా మారిన సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌లే బిగ్ బాస్ బ్యూటీ అరియానాతో జిమ్ వీడియోలు సంచ‌ల‌నం అయ్యాయి. మరో బిగ్ బాస్‌ బ్యూటీ అషూ రెడ్డి ఫోటోషూట్ తోనూ హీట్ పెంచారు.

సినిమా ప్ర‌మోష‌న్స్ లో క‌థానాయిక‌ల‌తో తైత‌క్క‌లు ష‌రా మామూలుగా మారాయి. తాజాగా బ‌ర్త్ డే పార్టీలో ఓ అమ్మాయితో ఆయన ప్రవర్తించిన తీరు అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. లైఫ్ ఎట్ ఆర్జీవీ కంపెనీ ఎఫ్‌.బిలో షేర్‌ చేసిన ఈ వీడియోలో నటి జ్యోతి.. శ్రీకాంత్ అయ్యంగార్ ఉన్నారు. చిత్ర‌బృందంలోని ఒక న‌టి కేక్ క‌ట్ చేసి బ‌ర్త్ డేని సెల‌బ్రేట్ చేసుకున్నారు. ప్ర‌స్తుతం ఈ వీడియో సోష‌ల్ మీడియాల్లో వైర‌ల్ గా మారింది. దీనికి నెటిజ‌నుల స్పందన అనూహ్యంగా ఉంది. `బతికితే వర్మలా బ్ర‌తకాలి`.. `మ‌హానుభావుడు` అంటూ కొంద‌రు పొగిడేస్తున్నారు. వ‌య‌స్సు పెరుగుతున్న కొద్ది వ‌ర్మ తుంట‌రి చేష్ట‌లు మరింత ముదురుతున్నాయి కానీ తగ్గడం లేదు అంటూ ఒక నెటిజ‌నుడు కామెంట్ చేశారు.