Begin typing your search above and press return to search.

వర్మ అతి శృతి మించి పోయింది

By:  Tupaki Desk   |   30 Dec 2019 2:34 PM IST
వర్మ అతి శృతి మించి పోయింది
X
దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ ఏం చేసినా సోషల్‌ మీడియా లో చర్చనీయాంశం అయ్యేలానే చేస్తూ ఉంటాడు. వర్మ ఆమద్య స్టేజ్‌ పై హీరోయిన్‌ తో స్టెప్పులు వేసి అందరిని నోరు వెళ్లబెట్టేలా చేశాడు. అది డాన్సా అంటూ చాలా మంది ప్రశ్నిస్తూ విమర్శలు గుప్పించారు. తాగి స్టేజ్‌ పై ఏంటీ ఆ గంతులు అంటూ విమర్శల పాలయ్యాడు. విమర్శలను.. వివాదాలను ఎప్పుడు కూడా పట్టించుకోని రామ్‌ గోపాల్‌ వర్మ మరోసారి అదే విధంగా తాను అనుకున్నది చేశాడు.

వర్మ నిర్మాణంలో అగస్త్య మంజు దర్శకత్వం లో తెరకెక్కిన చిత్రం 'బ్యూటీఫుల్‌'. ఈ చిత్రం ప్రమోషన్‌ కార్యక్రమంలో వర్మ ఈమద్య తెగ కనిపిస్తూ ఉన్నాడు. నిన్న రాత్రి ప్రీ న్యూ ఇయర్‌ పార్టీని చిత్ర యూనిట్‌ సభ్యులు జరుపుకున్నారు. ఈ సందర్బంగా హీరోయిన్‌ నైనా గంగూలీ కాళ్ల మీద పడి ఆమెకు నమస్కరించాడు. సినిమా పబ్లిసిటీ కోసం ఆమె కాళ్లు పట్టుకుని సినిమాను జనాల్లో బాగా పాపులర్‌ అయ్యేలా చేశాడంటూ కొందరు విమర్శలు గుప్పిస్తూ ఉంటే వర్మ తాను అనుకున్నది చేశాడంటూ కొందరు సమర్ధిస్తున్నారు.

వోడ్కా విత్‌ వర్మ ప్రీ న్యూఇయర్‌ పార్టీ పేరు తో జరిగిన ఈ వేడుకలో బ్యూటీఫుల్‌ చిత్ర యూనిట్‌ సభ్యులందరితో పాటు కొందరు మీడియా వారు కూడా హాజరు అయినట్లుగా తెలుస్తోంది. వర్మ సన్నిహితులు ఈ పార్టీ లో వర్మ చేసిన పనికి అవాక్కవుతున్నారు. నైనా కాళ్లు పట్టుకోవడం కాకుండా పూర్తిగా పడుకుని ఆమె కాళ్లకు దండం పెట్టాడు. ఆ సమయంలో నైనా కూడా చాలా ఎమోషనల్‌ అయ్యింది. ఆమె కన్నీరు పెట్టుకుందని ప్రత్యక్షం గా చూసిన వారు చెబుతున్నారు. మొత్తానికి వర్మ చేస్తున్న అతి శృతి మించి పోతుందని.. ఆయన తాగిన మత్తు లో ఏం చేస్తున్నాడో అర్థం కాకుండా చేస్తున్నాడంటూ కామెంట్స్‌ వస్తున్నాయి.