Begin typing your search above and press return to search.

వ‌ర్మ భ‌యం:ఆయ‌న అభిమానులు చంపేస్తారేమో

By:  Tupaki Desk   |   18 April 2016 4:59 PM GMT
వ‌ర్మ భ‌యం:ఆయ‌న అభిమానులు చంపేస్తారేమో
X
సంచ‌ల‌న చిత్రాల డైరెక్ట‌ర్‌ గా ఎంత పాపుల‌ర్ అయ్యాడో అంత‌కంటే ఎక్కువ‌గా విమ‌ర్శల ద్వారా గుర్తింపు పొందిన డైరెక్ట‌ర్ రాంగోపాల్ వ‌ర్మ. ఈ ట్వీట్ల ద‌ర్శ‌కేంద్రుడు మ‌రోమారు సూప‌ర్‌ స్టార్‌ ను కెలికాడు. అంతే కాదు తీవ్ర దుమారంలో చిక్కుకున్నాడు. ఇంత‌కీ ఆ సూప‌ర్‌ స్టార్ ఎవ‌రంటే త‌లైవార్‌ ర‌జ‌నీకాంత్‌.

ప్ర‌ముఖ న‌టీమ‌ణి అమీజాక్సన్‌ తో సూప‌ర్‌ స్టార్ ర‌జినీతో దిగిన సెల్ఫీని వ‌ర్మ త‌న ట్విట్ట‌ర్ అకౌంట్లో పోస్ట్ చేసి సెటైర్లు వేశారు. "అథమ స్థాయిలో ఉన్న అందం - సిక్స్‌ ప్యాక్ కూడా లేని ఫిట్‌ నెస్‌ - స‌రైన విధంగా లేని శ‌రీరం - నామ‌మాత్రంగా చేసే డ్యాన్స్‌...ఇలాంటి అత్యంత సాధార‌ణ‌మైన వ్య‌క్తి సూప‌ర్‌ స్టార్ ఎలా అయ్యారు? " అంటూ కామెంట్ చేశారు. వ‌ర్మ పెట్టిన ఈ పోస్ట్‌ పై వెంట‌నే ర‌జినీ ఫ్యాన్స్ రియాక్ట‌య్యారు. కుప్ప‌లు తెప్ప‌లుగా ట్వీట్లు చేస్తూ వ‌ర్మ‌పై దుమ్మెత్తిపోశారు.

దీంతో షాక్ తిన్న వ‌ర్మ మాట మార్చి న‌ష్ట తీవ్ర‌త త‌గ్గించే ప్ర‌య‌త్నం చేశారు. తాను ర‌జినీని పొగిడానే తప్ప కించ‌ప‌ర్చ‌లేద‌ని చెప్పుకొచ్చారు. త‌న అస‌లు ఉద్దేశాన్ని అర్థం చేసుకోకుండా ఫ్యాన్స్ ఊగిపోయార‌ని ఎద్దేవా చేశారు. అంతేకాదు అభిమానుల కోపం చూస్తే చంపేసేలా ఉన్నార‌ని జోక్ చేశారు.