Begin typing your search above and press return to search.

ఆరే కేఏ పాల్.. కరోనాపై సుత్తి సలహాలు ఆపు: వర్మ

By:  Tupaki Desk   |   19 March 2020 9:57 AM IST
ఆరే కేఏ పాల్.. కరోనాపై సుత్తి సలహాలు ఆపు: వర్మ
X
జనాలంతా కరోనాతో భయాందోళనలు వ్యక్తం చేస్తుంటే వివాదాస్పద రాంగోపాల్ వర్మ మాత్రం అదే కరోనా భయంతో ఎంజాయ్ చేస్తున్నారు. కరోనాను ప్రార్థనలతో తగ్గిస్తానని ఇటీవల వీడియో రిలీజ్ చేసిన కేఏ పాల్ ను, ప్రపంచాన్ని షేక్ చేసిన బాహుబలి సినిమాపై తాజాగా రాంగోపాల్ వర్మ పంచులు వేశారు. సెటైర్ల వర్షం కురిపించాడు.

వర్మ కొద్దిరోజులుగా కరోనా వైరస్ పై రకరకాల ట్వీట్లు చేస్తూ సెటైర్లు వేస్తున్నారు. కరోనా గురించి ఏ టాపిక్ ను వదలకుండా వికటట్టహాసం చేస్తున్నారు.

తాజాగా వర్మ తన ప్రియుమైన నేత కేఏపాల్ పై ట్వీట్ చేశారు. ‘ఆరే కేఏ పాల్.. ఈ సుత్తి సలహాలు ఇచ్చే బదులు నీ దేవునితో చెప్పి కరోనాని తీసేయమని చెప్పొచ్చు కదరా సుబ్బారావు.. నీకు నిజంగా దేవుడి దగ్గర అంత సీన్ ఉంటే నేను తిట్టిన తిట్లకు నాకు కరోనా వచ్చేట్లు చేయి ఎంకమ్మా’ అంటూ కేఏ పాల్ పై వర్మ సెటైర్లు వేశారు. ఈ పోస్టు సోషల్ మీడియాతో వైరల్ అయ్యింది.

ఇక వర్మ బాహుబలిని కూడా వదలలేదు. కరోనాతో ముడి పెట్టి కరోనా క్యూ ముందు బాహుబలి సినిమా టికెట్ల కోసం వేచిఉన్న క్యూ దిగదుడుపేనని సెటైర్ వేశారు. తాజాగా కరోనా దెబ్బకు అమెరికాలో అన్ని వ్యవస్థలు స్తంభించిపోయాయి. విద్యా, వ్యాపార సంస్థలు, మాల్స్ అన్నీ మూతపడ్డాయి. దీంతో అమెరికన్లు అప్రమత్తమై ముందుగానే కావాల్సిన నిత్యావసర సరుకులు తెచ్చిపెట్టుకుంటున్నారు. దీంతో పెద్ద ఎత్తున మాల్స్, సూపర్ మార్కెట్ల ముందు కిలోమీటర్ల క్యూలైన్లు కనిపించాయి. ఆ వీడియోను షేర్ చేసిన రాంగోపాల్ వర్మ.. ‘బాహుబలి సినిమా టికెట్ల క్యూలైన్లను మించి పోయిందని’ సరదాగా కామెంట్ చేశారు.

ఇలా కరోనా భయంతో జనాలు అంతా ఆందోళన చెందుతుంటే.. వర్మ మాత్రం ఇలా కరోనాను పండుగ చేసుకుంటున్నారు.