Begin typing your search above and press return to search.

ట్రంప్ పై ఆర్జీవీ దిమ్మ తిరిగే సెటైర్

By:  Tupaki Desk   |   22 Feb 2020 9:04 AM GMT
ట్రంప్ పై ఆర్జీవీ దిమ్మ తిరిగే సెటైర్
X
నిత్యం త‌న వివాదాస్పద వ్యాఖ్య‌ల‌తో వార్త‌ల్లో నిల‌వ‌డం విలక్ష‌ణ ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ‌కు అల‌వాటు. సినిమా - సెక్స్... రాజ‌కీయాలు...ఇలా స‌మ‌కాలీన విష‌యం ఏదైనా త‌న‌దైన శైలిలో వ్యాఖ్యానించ‌డం ఆయ‌న‌కు ప‌రిపాటి. త‌న రామూయిజాన్ని వినిపించే క్ర‌మంలో వ‌ర్మ కొన్ని సార్లు ఇబ్బందులు కూడా ఎదుర్కొన్న సంద‌ర్భాలున్నాయి. కొద్ది రోజుల క్రితం దిశ కేసు నిందితుడు చెన్న‌కేశ‌వులు భార్య‌ను క‌లిసిన వ‌ర్మ‌....ఆమెకు ఆర్థిక సాయం అందించాలంటూ పిలుపునిచ్చి వార్త‌ల్లో నిలిచాడు. ఇక‌, తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ పై వ‌ర్మ ఫోక‌స్ పెట్టాడు. ట్రంప్‌ న‌కు ఆహ్వానం అందించేందుకు 10 మిలియ‌న్ల మంది ప్ర‌జ‌లు వ‌స్తున్నార‌న్న విష‌యంపై వర్మ తనదైన శైలిలో సెటైరిక‌ట్ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఆ ట్వీట్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయింది.

అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ ప‌ర్య‌ట‌న‌పై స‌ర్వ‌త్రా ఆస‌క్తి ఏర్ప‌డ్డ సంగ‌తి తెలిసిందే. ట్రంప్‌ కు గుజ‌రాత్ వెనుక‌బాటు త‌నం క‌న‌బ‌డ‌కుండా గోడ క‌ట్టారంటూ నెటిజ‌న్లు ట్రోల్ చేస్తున్నారు. మ‌రోవైపు, త‌న భార‌త పర్య‌ట‌న సంద‌ర్భంగా 10 మిలియన్ల ప్రజలు ఆహ్వానిస్తార‌ని ట్రంప్ అన్నారు. ఈ నేప‌థ్యంలో వ‌ర్మ‌....ఈ విష‌యంపై ట్వీట్ చేశారు. ట్రంప్‌ ను 10 మిలియన్ల ప్రజలు ఆహ్వానించాలంటే ఒకటే దారుంద‌ని - ట్రంప్ పక్కన అమితాబ్ బచ్చన్ - సల్మాన్ ఖాన్ - ఆమిర్ ఖాన్ - షారుఖ్ ఖాన్ - రజనీకాంత్ - కత్రినా కైఫ్ - దీపికా పదుకునే - సన్నీ లియోన్ లను నిల్చోబెడితే అది సాధ్యమేన‌ని వర్మ త‌న‌దైన శైలిలో చమత్కరించాడు. వర్మ ట్వీట్ పై నెటిజ‌న్లు సెటైర్లు వేస్తున్నారు. కేఏ పాల్ - మెగాస్టార్ చిరంజీవి - పవన్ కల్యాణ్ లను మర్చిపోయారంటూ రీట్వీట్ చేశారు. ట్రంప్ ప‌క్క‌న శ్రీ‌రెడ్డి నిలుచుంటే వేరెవ‌రూ అవ‌స‌రం లేద‌ని, శ్రీ‌రెడ్డిని వ‌ర్మ ఒప్పించాల‌ని పంచ్‌ లు వేస్తున్నారు.