Begin typing your search above and press return to search.

శ్రీరెడ్డి తో డేటింగ్.. లోపలికే అంటున్న వర్మ!

By:  Tupaki Desk   |   4 March 2020 2:15 PM IST
శ్రీరెడ్డి తో డేటింగ్.. లోపలికే అంటున్న వర్మ!
X
శ్రీరెడ్డి పేరు వినని తెలుగువారు అసలు తెలుగువారే కాదు. ఇక వర్మ వివాదాల గురించి తెలియని సినీ ప్రేమికులు అసలు సినీ ప్రేమికులే కాదు. ఇలాంటి ఇద్దరు వ్యక్తులకు సంబంధించిన ఒక న్యూస్ ఎప్పుడూ స్పైసీగానే ఉంటుంది. అలా ఉండకపోతే అది అసలు న్యూసే కాదు. పోయినేడాది ఆర్జీవీ సినిమా 'అమ్మరాజ్యంలో కడప బిడ్డలు' సినిమాలో శ్రీరెడ్డి నటించింది. ఆ సమయం లో వర్మకు శ్రీ రెడ్డి ఓ డేటింగ్ ఆఫర్ ఇచ్చింది. అప్పట్లో అది మీడియాలో ఓ హాట్ టాపిక్ అయింది.

సీన్ కట్ చేస్తే రీసెంట్ గా ఒక వెబ్ ఛానెల్ ఇంటర్వ్యూలో ఆర్జీవీని ఇంటర్వ్యూయర్ ఎన్నో ప్రశ్నలు వేశారు. పనిలో పనిగా శ్రీరెడ్డి డేటింగ్ ఆఫర్ పై స్పందన కోరారు. సాదాసీదా ప్రశ్నలకే బుర్రతిరిగే సమాధానాలు ఇచ్చే వర్మ ఇలాంటి ప్రశ్నను ఆషామాషీగా ఎలా వదులుతాడు? తనదైన శైలిలో షాఘౌస్ బిర్యాని ఘాటు గుర్తొచ్చేలా "డేటింగ్ అంటే అమ్మాయి అబ్బాయి కలిసి రెస్టారెంటుకో.. ఇంకో చోటుకో వెళ్లడం. నేనైతే ఏ అమ్మాయితో కలిసి బయటకు వెళ్లను.. వెళ్తే అది లోపలికే. అది శ్రీరెడ్డి కావొచ్చు..మరొకరు కావొచ్చు" అంటూ కుండబద్దలు కొట్టాడు.

మరి శ్రీరెడ్డి గారి డేటింగ్ ఆఫర్ కు అసలు అర్థం ఏంటో తెలియదు కానీ ఆర్జీవీ దృష్టిలో మాత్రం డేటింగ్ అంటే 'అదే'. నో నాన్సెన్స్.. న్యూసెన్స్.. ఓన్లీ ఎసెన్స్! ఈ భారతదేశంలో ఫ్రీడం ఉండేది ఒక్క వర్మకే అని చాలామంది అభిప్రాయం. శ్రీరెడ్డి డేటింగ్ ఆఫర్ కు శ్రీమాన్ వర్మవారి జవాబు చూస్తే ఆ విషయం ఒప్పుకోక తప్పదు!