Begin typing your search above and press return to search.

రామ్ గోపాల్ వ‌ర్మ ప్రొడ్యూస‌ర్ అరెస్ట్

By:  Tupaki Desk   |   22 Dec 2021 8:00 PM IST
రామ్ గోపాల్ వ‌ర్మ ప్రొడ్యూస‌ర్ అరెస్ట్
X
వివాదాస్ప‌ద చిత్రాల ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ తో సంచ‌ల‌న చిత్రాల‌ని నిర్మించిన నిర్మాత అరెస్ట్ అయ్యారు. నిర్మాత‌గా మంచి ట్రాక్ రికార్డ్ వున్న ప‌రాగ్ సింఘ్వీ అరెస్ట్ కావ‌డం బాలీవుడ్ లో సంచ‌ల‌నంగా మారింది.

దాదాపు 15 ఏళ్లుగా ఆయ‌న బాలీవుడ్ లో నిర్మాత‌గా కొన‌సాగుతున్నారు. అలాంటి వ్య‌క్తి అరెస్ట్ కావ‌డం బాలీవుడ్ వ‌ర్గాల్లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. మ‌నీ లాండ‌రింగ్ ఆరోప‌ణ‌ల నేప‌థ్యంలో ఇటీవ‌ల ప‌రాగ్ ఆస్తుల‌పై ఈడీ అధికారులు దాడులు నిర్వ‌హించారు.

ఇల్లు , క్ల‌బ్‌, ఆఫీసుల్లో సోదాలు నిర్వ‌హించిన పోలీసులు సోమ‌వారం ప‌రాగ్ సింఘ్వీని అదుపులోకి తీసుకున్నారు. డిసెంబ‌ర్ 24 వ‌ర‌కు అత‌ను డిఫెన్స్ వింగ్ క‌ష్ట‌డీలో వుండాల‌ని కోర్టు ఉత్త‌ర్వులు జారీ చేసింది. ప‌రాగ్ ఓ ఫ్రాడ్ కేసులో ప్ర‌ధానంగా వున్నందు వ‌ల్ల‌నే ఆయ‌న‌ని పోలీసులు అరెస్ట్ చేసిన‌ట్టుగా బాలీవుడ్ వ‌ర్గాలు చెబుతున్నాయి. ప‌రాగ్ డిస్ట్రిబ్యూట‌ర్‌గా, ఫైనాన్షియ‌ర్‌గా, నిర్మాత‌గా గ‌త 15 ఏళ్లుగా బాలీవుడ్ లో మంచి సంబంధాల‌ని క‌లిగి వున్నారు.

స‌ల్మాన్ ఖాన్ న‌టించిన `పార్ట్‌న‌ర్`, భూత్ రిట‌ర్న్స్‌, వ‌ర్మ రూపొందించిన `ది ఎటాక్స్ ఆఫ్ 26/11` వంటి చిత్రాల‌కు నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రించ‌డ‌మే కాకుండా కె సెర సెర నిర్మించిన అబ్‌త‌క్ చ‌ప్ప‌న్‌, వాస్తు శాస్త్ర‌, డ‌ర్నా మ‌నాహై. డ‌ర్నాజ‌రూరీ హై, ఏక్ హ‌సీనాథీ, గోల్ మాల్ ఫ‌న్ అన్ లిమిటెడ్‌, నాచ్‌, గాయ‌బ్ వంటి త‌దిత‌ర హిట్ చిత్రాల‌కు ప‌రోక్షంగా పార్ట్‌న‌ర్‌గా వ్య‌వ‌హ‌రించారు.

అంతే కాకుండా వ‌ర్మ రూపొందించిన `స‌ర్కార్ 3`, `ది ఎటాక్స్ ఆఫ్ 26/11` చిత్రాల‌కు ప‌రాగ్ కీల‌క భూమిక పోషించారు. గ‌త కొన్నేళ్లుగా వ‌ర్మ‌తో మంచి అనుబంధం ఏర్ప‌ర‌చుకున్న ప‌రాగ్ ఇప్పుడు అరెస్ట్ కావ‌డం వ‌ర్మ అనుకూలుర‌కు షాక్ క‌లిగిస్తోంది.