Begin typing your search above and press return to search.

మహిళలపై ఆర్జీవీ వెటకారపు వోడ్కా ట్వీట్...!

By:  Tupaki Desk   |   5 May 2020 11:03 AM IST
మహిళలపై ఆర్జీవీ వెటకారపు వోడ్కా ట్వీట్...!
X
కాంట్రవర్శీలకు కేరాఫ్‌ అడ్రస్‌ అయిన కాంట్రవర్శీ కింగ్ రామ్‌ గోపాల్‌ వర్మ సోషల్‌ మీడియాలో యాక్టివ్‌ గా ఉంటారన్న విషయం తెలిసిందే. సోషల్ మీడియా అనేది ఈయన వాడకానికే పుట్టిందా అనే రేంజ్ లో వాడుతుంటారు. వివిధ అంశాలపై తనదైన శైలిలో స్పందిస్తూ సమాజంలో జరిగే అనేక విషయాల మీద ఫోకస్‌ పెట్టి తన అభిప్రాయాలను నిర్మొహమాటంగా చెబుతుంటాడు ఆర్జీవీ. ప్రస్తుతం క‌రోనా వైర‌స్ దేశ వ్యాప్తంగా విస్త‌రిస్తున్న నేప‌థ్యంలో క‌రోనాపై వ‌రుస ట్వీట్లు చేస్తూ వార్త‌ల్లో ఉంటూ వస్తున్నాడు వ‌ర్మ. ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త కొత్త ట్వీట్లతో నెటిజ‌న్స్‌ని ఆక‌ట్టుకునే ప్ర‌య‌త్నం చేస్తూనే వున్నారు. ఇప్పుడు తాజాగా ట్విట్టర్‌‌ లో వర్మ చేసిన వెటకారపు వోడ్కా ట్వీట్ ఒకటి వైరల్ అవుతోంది. అంతేకాదు ఆర్జీవీకి సింగర్ సోనా అదిరిపోయే కౌంటర్ ఇవ్వడం కూడా చర్చనీయాంశంగా మారింది.

కరోనా లాక్‌ డౌన్ కారణంగా గత కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా మద్యం షాపులు మూత పడ్డాయి. దీంతో మందు బాబులకు సుక్క దొరక్క తిక్క తిక్క పనులు చేసిన వీడియోలు మనం చాలానే చూశాం. అయితే మూడో విడత లాక్‌ డౌన్‌ లో మాత్రం మద్యం ప్రియులకు ఊరటనిచ్చే నిర్ణయం తీనుకుంది కేంద్ర ప్రభుత్వం. కొన్ని షరతులు విధించి వైన్ షాపుల వద్ద సామాజిక దూరం పాటించేలా చర్యలు తీసుకుంటూ మద్యం అమ్మకాలు ప్రారంభించుకోవచ్చని రాష్ర్ట ప్రభుత్వాలను ఆదేశించింది. దీంతో కొన్ని రాష్ట్రాల్లో మద్యం షాపులు తెరుచుకున్నాయి. అయితే ఇన్ని రోజులు మందు దొరకక ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన మందు బాబులంతా ఒక్కసారిగా రోడెక్కడంతో అన్ని షాపుల వద్ద బారీ క్యూ లైన్లు వెలిశాయి. మద్యం కోసం మగాళ్లతో పాటు ఆడవాళ్లు కూడా క్యూ కట్టారు. వైన్‌ షాపుల ఎదుట మహిళలు వరుసలో నిలబడి ఉన్న ఫొటోను షేర్‌ చేస్తూ ‘‘చూడండి మద్యం షాపుల వద్ద ఎవరు క్యూలో ఉన్నారో. అవును పాపం, తాగే పురుషుల నుంచి మహిళలను రక్షించడం చాలా ముఖ్యం..’’ అంటూ ట్వీట్ చేశాడు వర్మ.

కాగా రామ్ గోపాల్ వర్మ వెటకారపు ట్వీట్ చూసిన బాలీవుడ్‌ సింగర్‌ సోనా మోహపత్రా కాస్త ఘాటుగానే రియాక్ట్ అయింది. ''డియర్ మిస్టర్ ఆర్జీవీ.. పురుషుల మాదిరిగానే.. మహిళలకు కూడా మద్యం కొనుక్కుని సేవించే హక్కు ఉంది. అయితే మందు తాగాక హింసాత్మకంగా ప్రవర్తించే హక్కు మాత్రం ఎవరికీ లేదు. మీ ట్వీట్ సెక్సిజం.. నైతికత రీక్స్ అర్థానికి వీలుగా ఉందంటూ'' కాస్త ఘాటుగా సమాధానమిచ్చారు సింగర్ సోనా మెహపాత్ర. ప్రస్తుతం వీరు చేసిన ట్వీట్స్ వైరల్ అయ్యాయి. కాగా ప్రస్తుత పరిస్థితుల్లో మద్యం అమ్మకాలు తిరిగి ప్రారంభించడానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వడంపై బాలీవుడ్‌ రచయిత జావేద్‌ అక్తర్‌, నటి మలైకా అరోరా, రవీణా టాండన్‌ తదితరులు నిరసన వ్యక్తం చేస్తూ ట్వీట్స్ చేసిన సంగతి తెలిసిందే.