Begin typing your search above and press return to search.

వర్మ కాంట్రవర్శల్ మూవీ కథేమైంది?

By:  Tupaki Desk   |   30 Jun 2016 12:13 PM GMT
వర్మ కాంట్రవర్శల్ మూవీ కథేమైంది?
X
రామ్ గోపాల్ వర్మ ఎప్పుడు ఏ సినిమా మొదలుపెడతాడో.. ఎప్పుడు రిలీజ్ చేస్తాడో.. ఎవ్వరికీ అర్థం కాదు. సొసైటీలో ఏదైనా అంశం హాట్ టాపిక్ అయితే.. వర్మలో ఎగ్జైట్మెంట్ వచ్చేస్తుంది. వెంటనే ఆ ఇష్యూ మీద సినిమా మొదలుపెట్టేస్తాడు. ఇందులో కొన్ని అనుకున్న ప్రకారమే సినిమాలుగా తయారవుతాయి. కొన్ని మాత్రం అర్ధంతరంగా ఆగిపోతాయి. వర్మ ఇలా పెండింగులో పెట్టిన సినిమాలు చాలానే ఉన్నాయి. ఆ మధ్య భారీ హైప్ మధ్య వర్మ మొదలుపెట్టిన ‘వంగవీటి’ సినిమా పరిస్థితేంటన్నది ఇప్పుడు జనాలకు అర్థం కాకుండా తయారైంది.

ఒకప్పటి విజయవాడ రాజకీయాల నేపథ్యంలో ఈ సినిమా ప్రకటించగానే విపరీతమైన హైప్ నెలకొంది. వర్మ రిలీజ్ చేసిన హీరో ఫస్ట్ లుక్ పోస్టర్లు.. దీని టైటిల్ సాంగ్ కూడా ఆసక్తి రేకెత్తించాయి. ఓ నెలా రెండు నెలల పాటు ఈ సినిమా వార్తల్లో నిలిచింది. కానీ ఆ తర్వాత దాని గురించి అందరూ మరిచిపోయారు. వర్మ హైదరాబాద్ నుంచి తన మకాంను ముంబయికి మార్చేశాడు. ‘వీరప్పన్’ సినిమా మీదే ఫోకస్ పెట్టాడు. ఆ సినిమా పూర్తయింది. విడుదలైంది. కానీ ‘వంగవీటి’ సంగతేంటన్నది మాత్రం తెలియడం లేదు.

వర్మ సైలెంటుగా సినిమాను పూర్తి చేసేస్తున్నాడో ఏంటో తెలియదు కానీ. ఈ సినిమాకు సంబంధించి వార్తలేమీ బయటికి రాలేదు. విజయవాడ రాజకీయాల మీద సినిమా చేస్తూ.. విజయవాడను చూపించకుంటే కష్టం. కాబట్టి ఇక్కడ కొన్ని సన్నివేశాలైనా తీయాలి. మరి వర్మ ఏం చేస్తున్నాడో తెలియట్లేదు మరి. వర్మ ఎలాగూ ఇప్పుడు మన మీడియా వాళ్లకు దొరకట్లేదు. కనీసం ఆయన మిత్రులైనా ‘వంగవీటి’ గురించి కొంచెం క్లారిటీ ఇస్తే బెటర్.