Begin typing your search above and press return to search.

వర్మ గారూ.. ఆ సినిమా కోసం వెయిటింగ్

By:  Tupaki Desk   |   31 March 2016 7:00 PM IST
వర్మ గారూ.. ఆ సినిమా కోసం వెయిటింగ్
X
ఇలా ఆలోచన పుట్టడం ఆలస్యం.. అలా సినిమాలు తీసేస్తుంటాడు రామ్ గోపాల్ వర్మ. ఐతే వర్మ తీసిన సినిమాలన్నీ పూర్తవుతాయని లేదు.. పూర్తయినవి విడుదలవుతాయనీ లేదు.. ఇలా ఎటూ కాకుండా పోయిన సినిమాలు చాలానే ఉన్నాయి. రాజశేఖర్ హీరోగా తీసిన ‘పట్టపగలు’ అలాగే మరుగున పడిపోయింది. సచిన్ జోషి-మీరా చోప్రా జంటగా నటించిన ‘సీక్రెట్’ కూడా అలాగే తయారైంది. ఇంకా ‘శ్రీదేవి’ పేరుతో మొదలుపెట్టిన మూవీ.. ‘స్పాట్’ అంటూ ఇంకో సినిమా కూడా అతీగతీ లేకుండా పోయాయి. ఐతే ఈ సినిమాల విషయంలో జనాలకు పెద్దగా ఆందోళన లేదు కానీ.. వర్మ సెన్సారోళ్లకు సవాల్ విసురుతూ మొదలుపెట్టిన ‘సింగిల్ ఎక్స్’ గురించే అభిమానులు ఆందోళన చెందుతున్నారు.

థియేట్రికల్ రిలీజ్ చేస్తే సెన్సారోళ్లు కత్తెర పట్టుకుని పైత్యం చూపించేస్తున్నారంటూ.. నేరుగా తన యూట్యూబ్ ఛానెల్ లోనే రిలీజ్ చేయడం కోసం ఈ ఎరోటిక్ మూవీ తీస్తున్నట్లు వర్మ ప్రకటించాడు. దీనికి సంబంధించిన ఎరోటిక్ పోస్టర్లతో కుర్రాళ్లకు కాక పుట్టించాడు వర్మ. నెలన్నర ముందు వరకు ఈ షార్ట్ ఫిలిం గురించి తరచుగా అప్ డేట్లు ఇచ్చేవాడు. త్వరలో రిలీజ్ చేయబోతున్నట్లు కూడా ప్రకటించాడు. కానీ తర్వాత దీని ఊసే ఎత్తడం లేదు. దీంతో యువ హృదయాలు గాయపడ్డాయి. వర్మ ఇలా ఊరించి ఊరించి.. సైలెంటైపోవడం అన్యాయమంటూ రసిక ప్రియులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్మ వాళ్ల ఆవేదన తీరుస్తూ సాధ్యమైనంత త్వరగా తన ‘సింగిల్ ఎక్స్’ను యూట్యూబ్ లోకి తెస్తే బెటరేమో.