Begin typing your search above and press return to search.
వర్మగారి మొగిలిపువ్వు ఏమైందబ్బా?
By: Tupaki Desk | 10 April 2017 5:32 PM ISTరామ్ గోపాల్ వర్మ ఎప్పుడు ఏ సినిమా మొదలుపెడతాడో తెలియదు. ఎప్పుడు ఆపేస్తాడో తెలియదు. కొన్ని సినిమాలు ప్రకటనతోనే ఆగిపోతాయి. కొన్ని మధ్యలో ఆగిపోతాయి. ఇంకొన్ని పూర్తయ్యాక ఆగిపోతాయి. పట్టపగలు.. శ్రీదేవి.. లేడీ బ్రూస్ లీ.. రెడ్డిగారు పోయారు.. ఇలా వర్మ ఘనంగా ప్రకటించి మధ్యలో వదిలేసిన సినిమాలు ఎన్నెన్నో. ఇందులో ‘పట్టపగలు’ సినిమా అయితే ఫస్ట్ కాపీతో రెడీ అయ్యాక అడ్రస్ లేకుండా పోయింది. దాని మీద జనాల్లో ఆసక్తి కూడా లేదు కాబట్టి వదిలేద్దాం. ఐతే వర్మ విడుదలకు సిద్ధం చేశాక కూడా వార్తల్లో లేకుండా పోయిన ‘మొగిలిపువ్వు’ సంగతే తేలాల్సి ఉంది.
ఒక టైంలో రామ్ గోపాల్ వర్మకు సన్నిహితుడిగా మారి.. ఆయన సినిమాలకు ఫైనాన్స్ కూడా చేసిన సచిన్ జోషి హీరోగా నటించిన సినిమా ‘మొగిలిపువ్వు’. ‘బంగారం’ భామ మీరా చోప్రా కథానాయికగా నటించింది. వర్మ స్టయిల్లో అక్రమ సంబంధాల మీద సాగే సినిమా లాగా కనిపించింది ఈ చిత్రం. దీన్ని ‘సీక్రెట్’ పేరుతో హిందీలో కూడా తీశాడు వర్మ. ట్రైలర్ అదీ చూస్తే పర్వాలేదనే అనిపించింది. అప్పట్లో ఈ సినిమాకు కొంచెం హైప్ కూడా వచ్చింది. రిలీజ్ కు సన్నాహాలు కూడా చేశారు. కానీ ఆ తర్వాత ఉన్నట్లుండి ఈ సినిమా వార్తల్లో లేకుండా పోయింది. మరి ఈ చిత్రం ఎప్పుడు చీకట్లోంచి బయటికి వచ్చి.. ప్రేక్షకుల ముందుకొస్తుందో చూడాలి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/